News March 17, 2024
NZB: జిల్లాలో భారీగా పంట నష్టం

ఉమ్మడి NZB జిల్లాలోని బిక్కనూరు, కామారెడ్డి, వర్నిలోని సిద్దాపూర్, కుసల్ దాస్ తండా, పైడిమాల, గుంటూరు క్యాంప్, చింతల్ పెట్ తండాతో పాటు పలు గ్రామాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి మొక్క జొన్న, జొన్న పంటలు నెలకొరిగాయి. వేల ఎకరాల్లో పంటనష్టపోయామని రైతులు వాపోతున్నారు. మండలాల్లోని వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News April 4, 2025
NZB: షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఖాయమేనా?

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ ఆలీకి మంత్రి పదవి దక్కడం ఖాయమని చర్చ జరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణలో ఒక మైనార్టీ ఉంటారని చేసిన ప్రకటన ఇందుకు ఊతం ఇస్తోంది. ఈ ప్రకటన.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో చోటు దక్కక నిరాశలో ఉన్న షబ్బీర్ ఆలీతో పాటు ఆయన అనుచరుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.
News April 4, 2025
నిజామాబాద్: దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఎలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేదీ లోగా గూగుల్ ఫామ్ https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం https://ccla.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
News April 4, 2025
NZB: కూలీ పనికి వెళ్లి.. మృత్యు ఒడిలోకి

నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన గంగాధర్ గురువారం గోదావరి నదిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ వినయ్ తెలిపారు. గోదావరి నదిలో పాడైపోయిన బోరు మోటారును తీయడానికి గంగాధర్ కూలీ పనికి వెళ్ళాడు. ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయినట్లు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.