News January 13, 2025

అప్పుడు జైలుకెళ్లిన వారికి రూ.20 వేల పెన్షన్

image

1975 నుంచి 1977 మ‌ధ్య దేశంలో ఎమర్జెన్సీ అమ‌లులో ఉన్న సమయంలో జైలుకెళ్లిన వారికి నెలవారీ రూ.20,000 పెన్షన్ మంజూరు చేస్తామ‌ని ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. పెన్షన్‌తో పాటు వారి వైద్య ఖర్చులనూ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, జనవరి 1, 2025 నాటికి జీవించి ఉన్న వారందరికీ ఈ సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని తెలిపింది. జైలులో ఎన్ని రోజులు ఉన్నా స‌రే వారందరూ అర్హులే అని హోం శాఖ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది.

Similar News

News January 14, 2025

వారెన్ బఫెట్ వారసుడిగా హువర్డ్

image

ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం వారెన్ బఫెట్(94) తన బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీకి వారసుడిగా రెండో కొడుకు హోవర్డ్‌(70)ను ఎంపిక చేశారు. $1 ట్రిలియన్ విలువైన సంస్థకు ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపడతారని తెలిపారు. తనకు ముగ్గురు పిల్లల మీద నమ్మకం ఉందని, హువర్డ్ తన బిడ్డ కాబట్టే అవకాశం లభించిందని పేర్కొన్నారు. హోవర్డ్ 30ఏళ్లకు పైగా కంపెనీ డైరెక్టర్‌గా పనిచేశారు. చదువు పూర్తైనప్పటి నుంచి తండ్రి బాటలో నడుస్తున్నారు.

News January 14, 2025

తప్పకుండా రాజకీయాల్లోకి వస్తా: వరలక్ష్మి

image

తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత సీఎం జయలలితే స్ఫూర్తి అని, తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందని చెప్పారు. ఆమె తండ్రి శరత్ కుమార్ కూడా AISMKని స్థాపించి తర్వాత బీజేపీలో విలీనం చేశారు. ఇటీవల <<15069754>>త్రిష కూడా<<>> పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

News January 14, 2025

Stock Market: పండగపూట కొంత ఊరట

image

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ముగిశాయి. ప్రీ-మార్కెట్‌లో జ‌రిగిన బిజినెస్ వ‌ల్ల‌ భారీ గ్యాప్ అప్‌తో ప్రారంభ‌మైన సూచీలు క‌న్సాలిడేట్ అవుతూ క‌దిలాయి. చివ‌రికి సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 76,499 వ‌ద్ద‌, నిఫ్టీ 90 పాయింట్లు ఎగ‌సి 23,176 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి. IT, FMCG స్టాక్స్ మిన‌హా అన్ని రంగాల షేర్ల‌కు కొనుగోళ్ల మ‌ద్ద‌తు ల‌భించింది. Adani Ent 7%, Adani Ports 5% మేర లాభ‌ప‌డ్డాయి.