News January 13, 2025

కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు

image

TG: కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. దరఖాస్తులతోపాటు కులగణన సర్వే ఆధారంగా రూపొందించిన జాబితా క్షేత్రస్థాయి పరిశీలన బాధ్యతలను కలెక్టర్లు, GHMC కమిషనర్‌కు అప్పగించింది. MPDOలు, మున్సిపల్ కమిషనర్లు ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డుల్లో ప్రదర్శించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు. కార్డుల్లో మార్పులకూ అవకాశం కల్పిస్తారు. ఈ నెల 26 నుంచి కొత్త కార్డులను జారీ చేస్తారు.

Similar News

News January 15, 2025

వరుసగా 8 హిట్లు ఖాతాలో..

image

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుసగా 8 సినిమాలు సక్సెస్ సాధించిన ఈతరం దర్శకుడు అనిల్ అని సినీ వర్గాలు తెలిపాయి. ఆయన డెబ్యూ మూవీ పటాస్ సూపర్ హిట్‌గా నిలవగా ఆ తర్వాత వచ్చిన సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి సక్సెస్ అందుకున్నాయి. దీంతో 100% సక్సెస్ రేటును ఆయన కొనసాగిస్తున్నారని పేర్కొన్నాయి.

News January 15, 2025

తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. కొత్తవి ఇస్తామన్న కమిటీ

image

పారిస్ ఒలింపిక్స్‌లో అందజేసిన పతకాలలో నాణ్యత లేదని అథ్లెట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. షూటర్ మనూ భాకర్ కూడా తన పతకాలు రంగు వెలిశాయని, తుప్పు పట్టాయని తెలిపారు. ఈ మెడల్స్‌ను త్వరలోనే రీప్లేస్ చేస్తామని IOC ప్రకటించింది. ఫ్రాన్స్ కరెన్సీని ముద్రించే ‘ఫ్రెంచ్ స్టేట్ మింట్’ కొత్త పతకాలను తయారుచేస్తుందని పేర్కొంది. కాగా విజేతల కోసం ప్రఖ్యాత ‘ఐఫిల్ టవర్’ ఇనుమును మిక్స్ చేసి 5,084 పతకాలను రూపొందించారు.

News January 15, 2025

లాస్ ఏంజెలిస్‌లో ఆరని కార్చిచ్చు

image

అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు ఇంకా కొనసాగుతోంది. మంటలు ఆర్పేందుకు సిబ్బంది నిరంతరం కష్టపడుతున్నా వారికి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. కాలిఫోర్నియాలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. దీంతో మంటల వ్యాప్తి పెరిగే అవకాశముంది. నిరాశ్రయులైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 24 మంది మరణించగా 88వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.