News January 14, 2025
కడప: 15న జరగాల్సిన UGC – NET పరీక్ష వాయిదా

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025 జనవరి 15న జరగాల్సిన UGC-NET డిసెంబర్ 2024 పరీక్షను సంక్రాంతి, పొంగల్ పండుగ సందర్భంగా వాయిదా వేశారు. 16 నుంచి జరగాల్సిన మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారు. అభ్యర్థులు తాజా అప్డేట్ల కోసం వెబ్సైట్ www.nta.ac.in ను సందర్శించాలని ఎన్టీఏ (ఎగ్జామ్స్) డైరెక్టర్ రాజేశ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కొత్త పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
Similar News
News September 13, 2025
మైదుకూరు: తల్లీబిడ్డ మిస్సింగ్

మైదుకూరుకు చెందిన ముత్తరాయపల్లెలో నివసించే మేకల సుమతి (22) తన రెండేళ్ల కుమారుడు చందుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనిపై భర్త చెండ్రాయుడు, ఆమె తల్లి మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. సుమతి ఆచూకీ తెలిసినవారు మైదుకూరు సీఐ (9121100618), ఎస్సై(9121100619)కు సమాచారం ఇవ్వాలని కోరారు.
News September 12, 2025
కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.
News September 12, 2025
భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

కడప కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.