News January 14, 2025
స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలి: హరీశ్
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం సరికాదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ విషయమై డీజీపీ జితేందర్‌కి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. స్టేషన్ బెయిల్‌పై కౌశిక్‌ను విడిచిపెట్టాలని కోరారు. మరోవైపు పోలీసులు ఎమ్మెల్యేను అనూహ్యంగా త్రీటౌన్ స్టేషన్ కు తరలించారు. జడ్జి ముందుకు ప్రవేశపెట్టే విషయంలో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఆయనకు స్టేషన్‌లో బస ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
Similar News
News January 15, 2025
ఆర్మీ డే ఇవాళే ఎందుకంటే?
భారత సైన్యాన్ని అధికారికంగా ఏప్రిల్ 1, 1895న స్థాపించారు. స్వాతంత్ర్యం తర్వాత చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ భారతదేశానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ మదప్ప కరియప్ప అనే కమాండర్‌కు ఇదే రోజున 1949లో బాధ్యతలు అప్పగించారు. దీనిని స్మరిస్తూ ప్రతి ఏటా JAN 15న ఆర్మీ డే నిర్వహిస్తున్నారు. ఈ రోజున సైనికుల శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వేడుకలు చేస్తారు.
News January 15, 2025
కోనసీమ ప్రభల తీర్థం గురించి తెలుసా?
AP: సంక్రాంతి వేడుకల్లో నిర్వహించే ప్రభల తీర్థానికి ప్రత్యేక స్థానం ఉంది. కోనసీమలోని జగ్గన్నతోటలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. కనుమ రోజు ప్రభలను ఊరు దాటిస్తే మంచిదని స్థానికుల విశ్వాసం. కొన్ని వందల ఏళ్ల క్రితం జగ్గన్నతోటలోనే ఏకాదశ రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. అప్పటి నుంచి ప్రతి కనుమ రోజున వీటిని ఒకే చోట చేర్చుతారు. ఈ ప్రభలను తీసుకొచ్చే క్రమంలో యువకులు పొలాలు, వాగులు దాటుతూ ముందుకు సాగుతారు.
News January 15, 2025
కనుమ రోజున రథం ముగ్గు.. ఎందుకంటే?
కనుమ రోజున తెలుగు లోగిళ్లలో రథం ముగ్గు వేయడం ఆచారంగా ఉంది. దీని వెనుక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం అని, ఈ దేహమనే రథాన్ని నడిపేది దైవమని భావిస్తారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ రకంగా ప్రార్థిస్తారు. పాతాళం నుంచి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని ఓ కథ. అయితే ఈ ముగ్గులు వీధిలోని ఇళ్లను కలుపుతూ వేయడం వల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తోంది.