News January 14, 2025
స్టేషన్‌లోనే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అర్ధరాత్రి కరీంనగర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన సంగతి తెలిసిందే. స్టేషన్‌లోనే ఆయనకు బస ఏర్పాటు చేయగా ఉదయాన్నే వైద్య పరీక్షలు నిర్వహించారు. 9 గంటలకు కరీంనగర్ రెండవ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరుపరచనున్నారు. మరోవైపు కౌశిక్ అరెస్టును బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
Similar News
News September 15, 2025
నేడు మెగా డీఎస్సీ తుది జాబితా విడుదల

AP: ఇవాళ మెగా DSC తుది ఎంపిక జాబితా విడుదలకానుంది. అధికారిక వెబ్‌సైట్, జిల్లా విద్యాధికారి, కలెక్టర్ కార్యాలయాల్లోనూ రిజల్ట్ అందుబాటులో ఉంచనున్నారు. 16,347 ఉపాధ్యాయ పోస్టులకుగానూ జూన్ 6 నుంచి జులై 2 వరకు రెండు విడతలుగా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. జులై 5న ప్రాథమిక కీ, ఆగస్టు 1న ఫైనల్ కీ విడుదలైంది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కూడా పూర్తైంది. ఈనెల 19న అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు.
News September 15, 2025
నేటి నుంచి ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్

TG: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించిన తెలంగాణ ఐసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఇవాళ ప్రారంభంకానుంది. ఈరోజు రిజిస్ట్రేషన్స్, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ఉంటుంది. రేపు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారు. 16, 17 తేదీల్లో వెబ్ ఆప్షన్స్, 20న సీట్లు కేటాయిస్తారు. పూర్తి వివరాల కోసం WWW.TGICET.NIC.INను సందర్శించండి.
News September 15, 2025
ఆందోళనలకు తలొగ్గం: బ్రిటన్ ప్రధాని

వలసలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న <<17705243>>నిరసనల్లో<<>> దాడులు జరగడాన్ని UK PM కీర్ స్టార్మర్ ఖండించారు. ‘జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న వారికి బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కుంది. అధికారులపై దాడులు చేయడంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరు. కలర్, బ్యాగ్రౌండ్ ఆధారంగా ప్రజలను టార్గెట్ చేసుకోవడాన్ని అంగీకరించం’ అని స్పష్టం చేశారు.