News January 14, 2025
కడప: గాలిపటం ఎగరేస్తుండగా విద్యుత్ షాక్
సంక్రాంతితో కడప జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్దలు పిండివంటల తయారీలో బిజీగా ఉంటే, పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడపలోని శాంతి నగర్‌కు చెందిన ఓ బాలుడు సోమవారం గాలిపటం ఎగురేశాడు. విద్యుత్ వైర్లకు తగలడంతో తప్పించేందుకు గట్టిగా లాగగా విద్యుత్ వైరు బాలుడిపై పడి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. చికిత్స నిమిత్తం రిమ్స్‌కు అక్కడినుంచి మరో ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
Similar News
News January 15, 2025
కడప రెగ్యులర్ RJDగా శామ్యూల్
కడప రెగ్యులర్ RJD (పాఠశాల విద్యాశాఖ)గా కె.శామ్యూల్ నియమితులయ్యారు. కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న కె.శామ్యూల్ కడప జిల్లా RJDగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కడప జిల్లా RJDగా తన విధులను నిర్వహించనున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని వారు తెలిపారు.

కడప: సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంక్రాంతి వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు. కడప నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయము నందు బంగ్లాకు విచ్చేసిన గంగిరెద్దుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ దంపతులు సాంప్రదాయ బద్దంగా నూతన వస్త్రాలు సమర్పించారు.