News January 14, 2025
నెల్లూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాచలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇందుకూరుపేట(M), లేబూరుకు చెందిన కాలేషా(45), అతని కొడుకు హమీద్(12) మృతి చెందారు. మనుబోలులో జరిగిన రోడ్డుప్రమాదంలో సైదాపురం(M), గంగదేవిపల్లికి చెందిన సుబ్బయ్య(34), శంకరయ్య(39)దుర్మరణం చెందారు. గుడ్లూరులో జరిగి రోడ్డుప్రమాదంలో రాపూరుకు చెందిన వెంకటేశ్వర్లు(60), హార్దిక రాజ్(4) మరణించారు.
Similar News
News January 9, 2026
నెల్లూరు: ‘భోగి మంటల్లో అవి వేస్తే ప్రమాదం’

టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగి మంటలలో వేయొద్దని దుత్తలూరు PHC వైద్యులు సయ్యద్ ఆయూబ్ అప్సర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న సంక్రాంతి పండగల్లో భాగంగా భోగి మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కేన్సర్, టీబీ, చర్మ, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సంప్రదాయబద్ధంగా పండగలను చేసుకోవాలని పిలుపునిచ్చారు.
News January 9, 2026
నెల్లూరు జిల్లావ్యాప్తంగా రేపు, ఎల్లుండి వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో శని, ఆదివారాలలో జిల్లావ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అయితే జనవరిలో సాధారణంగా వర్షాలు పడవు. కానీ వాయుగుండం ఏర్పడటం, వర్షాలు కురవడం చాలా అరుదుగా ఉంటుంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడింది.
News January 9, 2026
నెల్లూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

నెల్లూరు రూరల్ పరిధిలో ఇంటిని అద్దెకు తీసుకుని కొందరు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ద్వారకామయి నగర్లోని నూతన లేఅవుట్లోని ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు మహిళలు, ఇద్దరు విటులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వేణు తెలిపారు.


