News March 17, 2024
శ్రీకాకుళం:గ్రూప్ -1 పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న గ్రూప్-1 పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ డా.మనజీర్ జీలాని సమూన్ స్థానిక శ్రీ చైతన్య స్కూల్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచనలు చేశారు.
Similar News
News April 16, 2026
విధిని వెక్కిరించిన సిక్కోలు విద్యార్థి

పలాసకు చెందిన సకల భక్తుల వంశీకి పుట్టుకతోనే చేతులు, కాళ్లు సహకరించని పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు 972 మార్కులు సాధించారు. తండ్రి లక్ష్మణరావు చిరు వ్యాపారి, తల్లి పార్వతి గృహిణి. స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చదివించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, టీచర్స్ , స్నేహితుల సహకారం మరువలేనిదని వంశీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
News April 15, 2026
శ్రీకాకుళం: కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో 87.82 శాతం ఉత్తీర్ణత

శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 772 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం తెలిపారు. 87.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అత్యధికంగా 978 మార్కులు వచ్చాయని అన్నారు. నాలుగు కేజీబీవీలు శత శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.
News April 15, 2026
SKLM:టీడీపీ జాతీయ – రాష్ట్ర కమిటీలో చోటు వీరికే !

పొలిట్ బ్యూర్ సభ్యుడు – అచ్చెన్నాయుడు
జాతీయ ప్రధాన కార్యదర్శి- రామ్మోహన్ నాయుడు, అధికార ప్రతినిధి -కలిశెట్టి అప్పలనాయుడు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి- గౌతు శిరీషా, ఉపాధ్యక్షురాలు- తమ్మినేని సుజాత (ఆమదాలవలస)
రాష్ట్ర అధికార ప్రతినిధి- కూన రవికుమార్
జోనల్ కోఆర్డినేటర్లు- బెందాళం అశోక్
కార్యనిర్వహక కార్యదర్శులు -వజ్జబాబూరావు(పలాస),బగ్గు అర్చన
కార్యదర్శులు – పొగిరి బుచ్చిబాబు(పాతపట్నం),M వెంకటేశ్ (SKLM).


