News January 14, 2025

ఎమ్మెల్యే కౌశిక్‌కు బెయిల్ మంజూరు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఆయన రిమాండ్ రిపోర్టును జడ్జి కొట్టేశారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో గందరగోళం సృష్టించారని, ఎమ్మెల్యే సంజయ్‌ను దుర్భాషలాడారని 3 కేసులు నమోదు కాగా నిన్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు చేసి, కోర్టు ముందు హాజరుపరచగా జడ్జి బెయిల్ ఇచ్చారు. రూ.10 వేల చొప్పున 3 పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశించారు.

Similar News

News November 8, 2025

స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉండాలంటే?

image

20ల్లోకి అడుగుపెట్టగానే చర్మతీరుకి తగిన స్కిన్ కేర్ రొటీన్ అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైల్డ్‌ క్లెన్సర్‌, టోనర్‌, సీరమ్‌, మాయిశ్చరైజర్‌, సన్‌స్క్రీన్‌ వాడాలి. వారానికోసారి స్క్రబ్‌, ఆరెంజ్‌ పీల్స్‌ అప్లై చేయాలి. హైలురోనిక్‌ యాసిడ్‌, రెటినాల్ వాడితే ముడతలు, మచ్చలు తగ్గుతాయి. వీటితోపాటు కూరగాయలు, పండ్లు, మంచి కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌, కార్బోహైడ్రేట్లున్న ఆహారం తీసుకోవాలి.

News November 8, 2025

4 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ

image

ప్రధాని మోదీ కొత్తగా 4 వందే భారత్ ట్రైన్లను యూపీలోని వారణాసి నుంచి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు రూట్లలో ఈ రైళ్లు నడవనున్నాయి. భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు కొత్త తరానికి నాంది అని మోదీ పేర్కొన్నారు.

News November 8, 2025

OP పింపుల్.. ఇద్దరు టెర్రరిస్టులు హతం

image

జమ్మూకశ్మీర్ కుప్వారా(D) కెరాన్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. చొరబాటుపై పక్కా సమాచారంతో ‘ఆపరేషన్ పింపుల్’ పేరుతో గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఓచోట నక్కిన టెర్రరిస్టులను గుర్తించడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగినట్లు చెప్పారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రమూకలు హతమయ్యారని, మరికొందరు ట్రాప్‌లో చిక్కుకున్నారని వెల్లడించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.