News January 14, 2025
రైతులకు గుడ్ న్యూస్.. కూరగాయల సాగుకు సబ్సిడీ!
TG: కూరగాయలు సాగు చేసే రైతులు శాశ్వత పందిళ్లు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాశ్వత పందిళ్లకు ఎకరానికి ₹3లక్షలు ఖర్చు కానుండగా, అందులో 50% సబ్సిడీ ఇవ్వనుంది. ఈ స్కీమ్‌ను తొలుత NZB(D) బోధన్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. తీగ జాతి కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ స్కీమ్ అమలుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను వినియోగించనున్నట్లు సమాచారం.
Similar News
News January 15, 2025
యుద్ధ నౌకలను ప్రారంభించనున్న PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా రెండు యుద్ధ నౌకలు INS సూరత్, నీలగిరి, ఒక జలాంతర్గామి వాఘ్‌షీర్‌ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో యుద్ధనౌకలను, జలాంతర్గామిని జాతికి అంకితం చేయనున్నారు. ఈ పర్యటనలోనే ఆయన మహాయుతి కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
News January 15, 2025
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పార్టీ అధిష్ఠానంతో క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులనూ ఆయన కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన అనంతరం సింగపూర్‌కు వెళ్లనున్న ఆయన ఈనెల 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటిస్తారు.
News January 15, 2025
క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నా: యువరాణి కేట్
బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తాను కాన్సర్ నుంచి బయటపడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉందని పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన కేట్ కొంతకాలంగా చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.