News January 14, 2025
దేశంలో అత్యంత రద్దీ నగరంగా కోల్‌కతా

భారత్‌లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల జాబితాలో కోల్‌కతా టాప్‌లో నిలిచింది. ఈ విషయంలో బెంగళూరును అధిగమించింది. 2024 టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం 10kms ప్రయాణానికి కోల్‌కతాలో 34min 33s, బెంగళూరులో 34min 10s టైమ్ పడుతుంది. ఈ రెండింటి తర్వాతి స్థానాల్లో పుణే (33m 22s), హైదరాబాద్ (31m 30s), చెన్నై(30m 20s), ముంబై(29m 26s), అహ్మదాబాద్ (29m 3s) ఉన్నాయి.
Similar News
News February 4, 2026
ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్ కొట్టివేత

TG: ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్‌ల అనర్హత పిటిషన్లనూ కొట్టేసిన విషయం తెలిసిందే.
News February 4, 2026
ట్రేడ్ డీల్ ఓకే.. క్వాడ్ ప్రాధాన్యం పెరుగుతుందా?

US-భారత్ ట్రేడ్ డీల్‌తో ఇరు దేశాల మధ్య రాజకీయ చిక్కుముడులు కూడా వీడనున్నట్టు కనిపిస్తోంది. విదేశాంగ మంత్రి జైశంకర్‌తో జరిగిన భేటీలో US సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియో క్వాడ్ ప్రస్తావన తేవడమే కారణం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, చైనాను కట్టడిచేసేందుకు US, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో ఈ క్వాడ్ ఏర్పాటైంది. టారిఫ్స్ హడావుడితో ట్రంప్ 2.0లో దీని ప్రాధాన్యం తగ్గగా ఇప్పుడు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది.
News February 4, 2026
మరో ప్రాణం తీసిన లోన్ యాప్

TG: లోన్ యాప్ ఏజెంట్ల దురాగతాలకు మరో ప్రాణం పోయింది. రూ.3వేల అప్పు చెల్లించలేదనే కారణంతో HYD రామ్‌నగర్‌కు చెందిన ప్రేమ్ కుమార్(36) అనే వ్యక్తిపై వేధింపులకు పాల్పడ్డారు. బాధితుడితోపాటు కుటుంబసభ్యుల మార్ఫ్‌డ్ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


