News January 14, 2025

జాతరకు రావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం

image

సారంగాపూర్ మండలం పొట్య గ్రామ పంచాయతీ పరిధిలోని బండ్రేవు తండాలో నాను మహరాజ్ జాతర ఉత్సవాలకు బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నాను మహారాజ్ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, దావుజీ, ప్రకాష్,జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 21, 2026

ఖానాపూర్‌లో రూ.13కోట్లతో సబ్‌స్టేషన్ల నిర్మాణం

image

ఖానాపూర్ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి రూ.13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. వీటి ద్వారా రైతులకు, గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు. వ్యవసాయ రంగంలో రూ.12,500 కోట్లతో ‘ఇందిరా సౌర గిరి వికాసం’ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

News January 21, 2026

ఆదిలాబాద్: రేపు ఇంటర్ ప్రాక్టికల్స్ యథాతథం

image

ఇంటర్మీడియట్ విద్యార్థులకు తొలిరోజు ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆదిలాబాద్ DIEO జాధవ్ గణేష్ తెలిపారు. గురువారం కూడా ప్రాక్టికల్స్ యథావిధిగా కొనసాగుతాయని నాగోబా సెలవు ఉండదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ప్రాక్టికల్‌కు హాజరు కావాలని సూచించారు. కాగా బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికల)లో జరిగిన ప్రాక్టికల్ పరీక్షలను DIEO సందర్శించి పరిశీలించారు.

News January 21, 2026

ఆదిలాబాద్: ’23న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్’

image

హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు జనవరి 23వ తేదీన జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (MPTM) నిర్వహిస్తున్నట్లు DIEO జాధవ్ గణేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా పాల్గొని విద్యార్థుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశం విద్యార్థుల విద్యా ప్రగతికి కీలకమని, తల్లిదండ్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.