News January 14, 2025
జలాంతర్గామి, యుద్ధ నౌకల ప్రారంభం రేపే

భారత నావికాదళం అమ్ములపొదిలో మరో 2 కీలక యుద్ధ నౌకలు, జలాంతర్గామి చేరనున్నాయి. INS సూరత్, INS నీలగిరి, INS వాఘ్‌షీర్‌ను ప్రధాని మోదీ బుధవారం ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ప్రారంభించనున్నారు. రక్షణ రంగ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామిగా నిలవాలనుకుంటున్న భారత ఆశయ సాధనలో వీటి ప్రారంభం కీలక ముందడుగు. ఇందులో INS సూరత్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక యుద్ధ నౌకలలో ఒకటి.
Similar News
News January 19, 2026
ఘోర పరాభవం

2024లో న్యూజిలాండ్‌పై స్వదేశంలో తొలి టెస్టు సిరీస్‌ను చేజార్చుకున్న టీమ్ ఇండియా తాజాగా తొలి వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పటివరకు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో సిరీస్‌ను కోల్పోని భారత జట్టు తాజా ఓటమితో ఈ అప్రతిష్ఠను మూటగట్టుకుంది. ఇక ఇండోర్ వేదికలో ఆడిన 8 మ్యాచుల్లో భారత్‌కిదే తొలి ఓటమి కావడం గమనార్హం.
News January 19, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 19, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.27 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.28 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.04 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.20 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.