News January 14, 2025

పవన్ ‘OG’ సినిమా ఏ OTTలోకి వస్తుందంటే?

image

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఈ మూవీ విడుదలై థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనుంది. దీనితో పాటు నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, మ్యాడ్ స్క్వేర్, సిద్ధూ జొన్నలగడ్డ ‘JACK’ ఓటీటీ రైట్స్‌ను కూడా సొంతం చేసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.

Similar News

News October 29, 2025

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 308 పోస్టులు

image

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌ 308 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, వొకేషనల్ కోర్సు చదివిన అభ్యర్థులు NOV 15వరకు అప్లై చేసుకోవచ్చు. ITI అప్రెంటిస్‌లు 300 ఉండగా.. వొకేషనల్ అప్రెంటిస్‌లు 8 ఉన్నాయి. వయసు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, విద్యార్హతలో మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://cochinshipyard.in/

News October 29, 2025

ఉపవాసంతో వృద్ధాప్యం దూరం

image

ఉపవాసం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. శరీరంలోని కణాలను రిపేర్ చేయడంతో పాటు నిద్ర, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను సరిచేస్తుందంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యఛాయలను దూరం చెయ్యడంలోనూ ఉపవాసం ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు సిర్టుయిన్స్ ఉత్పత్తై వృద్ధాప్యప్రక్రియకు వ్యతిరేకంగా పనిచేస్తాయని చెబుతున్నారు.

News October 29, 2025

అజహరుద్దీన్‌కు హోంశాఖ!?

image

TG: కాంగ్రెస్ సీనియర్ నేత <<18140326>>అజహరుద్దీన్‌కు<<>> హోం, మైనారిటీ సంక్షేమ శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హోంశాఖను సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. అటు అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ కలిసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక మరో రెండు మంత్రి పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉందని సమాచారం.