News January 14, 2025

అప్పుడు లేఖ రాయడానికి తుమ్మలకు పెన్ను దొరకలేదా?: అర్వింద్

image

TG: తాము కేంద్రానికి లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందన్న మంత్రి తుమ్మల వయసుకు తగ్గట్లు మాట్లాడాలని BJP MP అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు రాయని లేఖలు ఇప్పుడే రాశావా? అప్పుడు చదువు రాలేదా లేక హరీశ్‌కు అగ్గిపెట్టె దొరకనట్టు నీకు పెన్ను దొరకలేదా?’ అని ప్రశ్నించారు. TGని KCR అప్పులపాలు చేశారని ఆరోపించారు. INC, BRSకు అవినీతి తప్ప వేరే ధ్యాస లేదని, పసుపు బోర్డు తెచ్చింది బీజేపీయేనని అన్నారు.

Similar News

News September 8, 2025

లిక్కర్ కేసు నిందితులకు నోటీసులు!

image

AP: లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు ACB కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సిట్ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ చేపట్టిన HC బెయిల్‌పై విడుదలైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ACB కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం చట్ట విరుద్ధమని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. మిగిలిన నిందితులకు ఇలా బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.

News September 8, 2025

చరిత్ర సృష్టించిన తెలంగాణ ఆర్చర్ చికిత

image

ఇటీవల కెనడాలో జరిగిన వరల్డ్ ఆర్చరీ యూత్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆర్చర్ తనిపర్తి చికిత రికార్డు సృష్టించారు. జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌గా పరిగణించే ఈ పోటీల్లో చికిత కాంపౌండ్ అండర్-21 ఉమెన్స్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం సాధించారు. TSలోని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత తండ్రి ఆధ్వర్యంలోనే శిక్షణ పొందారు. ఈమె ఇప్పటికే పలుజాతీయస్థాయి పతకాలు సొంతం చేసుకున్నారు.

News September 8, 2025

బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి: భట్టి

image

TG: ఇందిరమ్మ ఇళ్లు, స్వయం ఉపాధి పథకాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణాలను ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ‘రుణమాఫీ, రైతు భరోసా పేరిట ప్రభుత్వం రైతుల పక్షాన రూ.30వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. రైతులకు సకాలంలో రుణాలు ఇవ్వండి. ఆస్తుల తాకట్టు, FDలు చేయండంటూ వారిని ఒత్తిడి చేయొద్దు. బ్యాంకర్లు మానవీయ కోణంలో ఆలోచించాలి’ అని సూచించారు.