News January 14, 2025

వారెన్ బఫెట్ వారసుడిగా హువర్డ్

image

ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం వారెన్ బఫెట్(94) తన బెర్క్‌షైర్ హత్‌వే కంపెనీకి వారసుడిగా రెండో కొడుకు హోవర్డ్‌(70)ను ఎంపిక చేశారు. $1 ట్రిలియన్ విలువైన సంస్థకు ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు చేపడతారని తెలిపారు. తనకు ముగ్గురు పిల్లల మీద నమ్మకం ఉందని, హువర్డ్ తన బిడ్డ కాబట్టే అవకాశం లభించిందని పేర్కొన్నారు. హోవర్డ్ 30ఏళ్లకు పైగా కంపెనీ డైరెక్టర్‌గా పనిచేశారు. చదువు పూర్తైనప్పటి నుంచి తండ్రి బాటలో నడుస్తున్నారు.

Similar News

News September 14, 2025

స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో జాబ్‌లు

image

<>ఇస్రో <<>>అనుబంధ సంస్థ స్పేస్ అప్లికేషన్ సెంటర్ 13 పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/బీఈ, పీజీ, ఎంటెక్/ఎంఈ, పీహెచ్‌డీ‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు సెప్టెంబర్ 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 35ఏళ్లు. వెబ్‌సైట్: https://careers.sac.gov.in/

News September 14, 2025

GREAT: పసిపాపతో ఇంటర్వ్యూకు హాజరై.. DSPగా

image

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూకు ఓ మహిళ తన చంటిపాపతో హాజరయ్యారు. మైహర్ జిల్లాకు చెందిన వర్షా పటేల్ గర్భవతిగా ఉన్నప్పుడు MPPSC పరీక్షలు రాసి స్టేట్ 11th ర్యాంక్ సాధించారు. ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు తన 20రోజుల కుమార్తె శ్రీజను ఒడిలో కూర్చోపెట్టుకున్నారు. ఇటీవల వెలువడిన ఫైనల్ ఫలితాల్లో ఆమె DSP ఉద్యోగానికి ఎంపికయ్యారు. వర్ష గతంలో 5సార్లు పరీక్షలు రాసి, 3సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.

News September 14, 2025

ఈసీఐఎల్‌లో 412 అప్రెంటిస్‌లు

image

హైదరాబాద్‌లోని <>ఈసీఐఎల్<<>> 412 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 22వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు కలదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అక్టోబర్ 7నుంచి 9వరకు జరుగుతుంది. వెబ్‌సైట్: https://www.ecil.co.in/