News January 14, 2025
యూజీసీ నెట్ కొత్త తేదీలివే..

రేపు జరగాల్సిన యూజీసీ నెట్-2025 పరీక్షను <<15149513>>వాయిదా<<>> వేసిన NTA తాజాగా రీషెడ్యూల్ తేదీలను ప్రకటించింది. ఈనెల 21న ఉదయం, 27న మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. కాగా సంక్రాంతి సందర్భంగా 15న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తూ నిన్న NTA ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Similar News
News January 19, 2026
రబీ వరిలో పెరిగిన తెగుళ్లు – కట్టడికి కీలక సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం పెరిగిన చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి బాగా పెరిగింది. ప్రధానంగా వరిలో కాండం తొలిచే పురుగు, సుడిదోమ, అగ్గి తెగులు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు, జింకు లోపం కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News January 19, 2026
మా కరెంట్‌తోనే భారత్‌లో AI సేవలు: US

భారత్‌లో AI సేవల కోసం అమెరికన్లు డబ్బులు చెల్లిస్తున్నారని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. USలోని కరెంట్‌తోనే చాట్‌జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్‌లు పనిచేస్తున్నాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్, చైనా వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్యం, రష్యాతో సంబంధాలపై భారత్ టార్గెట్‌గా నవారో గతంలోనూ పలు విమర్శలు చేశారు.
News January 19, 2026
IIM లక్నోలో 38పోస్టులు.. దరఖాస్తు చేశారా?

IIM లక్నోలో 38 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీఏ, పీజీ, డిగ్రీ( హార్టీకల్చర్/అగ్రికల్చర్), బీటెక్/బీఈ, ఎంటెక్/ఎంఈ /ఎంసీఏ, CA/CMA, B.Lib.Sc/M.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiml.ac.in/


