News January 14, 2025

నేషనల్ పాలిటిక్స్‌పైనే INDIA ఫోకస్: ప‌వార్‌

image

INDIA కూట‌మి కేవ‌లం జాతీయ రాజ‌కీయాలపై దృష్టిసారిస్తుంద‌ని, అసెంబ్లీ-స్థానిక ఎన్నిక‌ల‌పై కూట‌మిలో ఎలాంటి చ‌ర్చ లేద‌ని NCP SP చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ పేర్కొన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఒంటరిగా పోటీ చేయాలా? క‌లిసి పోటీ చేయాలా? అనేది త్వ‌ర‌లో నిర్ణ‌యిస్తామ‌న్నారు. అయితే, ఒంటరిగా పోటీ చేయ‌నున్న‌ట్టు శివ‌సేన UBT ఇప్పటికే ప్ర‌క‌టించింది. స్థానిక ఎన్నిక‌లు MVA పార్టీల‌కు జీవ‌న్మ‌ర‌ణ స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించాయి.

Similar News

News January 19, 2025

PHOTOS: మహాకుంభ్ నైట్ వ్యూ

image

యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. రాత్రి వేళ ఆ ప్రాంతం విద్యుత్ దీపాల వెలుగుల్లో ఎలా ఉంటుందో పైన ఉన్న ఫొటోల్లో చూడవచ్చు. ఫిబ్రవరి 26 వరకు కుంభమేళా కొనసాగనుంది.

News January 19, 2025

ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలివే!

image

వచ్చే నెలలో నాగచైతన్య ‘తండేల్’ (ఫిబ్రవరి 7), అజిత్ ‘పట్టుదల'(ఫిబ్రవరి 6)తో పాటు పలు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ ‘లైలా’, కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’, బ్రహ్మానందం, ఆయన తనయుడు గౌతమ్ నటించిన ‘బ్రహ్మా ఆనందం’ విడుదలవుతున్నాయి. 21న సందీప్ కిషన్ ‘మజాకా’, తమిళ డబ్బింగ్ సినిమా ‘డ్రాగన్’ రిలీజ్ కానున్నాయి. వీటిలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?

News January 19, 2025

GREAT: ఈ తల్లికి 19 మంది పిల్లలు.. అయినా..

image

ఈ రోజుల్లో పెళ్లైతే చాలు చాలామంది చదువుకు ఫుల్ స్టాప్ పెడదామనుకుంటారు. అయితే సౌదీ అరేబియాలో హమ్దా అల్ రువైలీ అనే మహిళకు ఏకంగా 19 మంది పిల్లలున్నా చదువు ఆపలేదు. బిజినెస్ స్టడీస్‌లో PhD పూర్తి చేశారు. దీని కోసం పగటి పూట పనులు చేస్తూ, రాత్రిళ్లు చదివానని చెప్పారు. 40 ఏళ్ల వయసులో అన్ని బాధ్యతల నడుమ డాక్టరేట్ పూర్తి చేసిన ఈ మహిళకు అంతా సెల్యూట్ కొడుతున్నారు.