News March 17, 2024

సీఎం జగన్ సారా వ్యాపారి: పవన్

image

AP: రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రావణ సంహారం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరుగుతుంది. సీఎం జగన్ ఒక సారా వ్యాపారి. బ్లాక్ మనీ పెరిగిపోయింది. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ అనుకుంటున్నారు. కానీ అదేమీ జరగదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News September 9, 2025

ఇంటర్ ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదల

image

AP: ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ చదువుతున్న విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపునకు ఇంటర్ విద్యా మండలి సెక్రటరీ కృతికా శుక్లా <>షెడ్యూల్<<>> విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి అక్టోబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే రూ.1,000 ఫైన్‌తో అక్టోబర్ 11 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే పాసైనవారు మళ్లీ రాసేందుకు రూ.1,350(ఆర్ట్స్), రూ.1,600(సైన్స్) చెల్లించాల్సి ఉంటుంది.

News September 9, 2025

ఓటేసిన టీడీపీ, బీజేపీ ఎంపీలు

image

ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. కాసేపటి క్రితమే టీడీపీ ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 16 మంది లోక్‌సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు ఓటు వేశారు. మరోవైపు తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం ఓటు వేశారు. వీరిలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు రఘునందన్ రావు, ఈటల, డీకే అరుణ తదితరులున్నారు.

News September 9, 2025

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

image

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. దేవుజీని నియమిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల మరణించారు.