News March 17, 2024
శ్రీకాకుళం: ప్రశాంతంగా గ్రూప్-1 పరీక్షలు

శ్రీకాకుళం జిల్లాలో గ్రూప్-1 పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పేపర్ -1 కు సంబంధించి మొత్తం 6,403 మందికి గానూ పరీక్షలకు 4,124 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. 2,279 మంది పరీక్షలకు హాజరుకానట్లు వెల్లడించారు. పేపర్-2కు సంబంధించి 6,403 మందికి 4088 మంది హాజరయ్యారు. 2,315 మంది పరీక్షలకు హాజరు కాలేదు.
Similar News
News February 5, 2026
శ్రీకాకుళం: నకీలి పాసుల కథ నడిపించిందెవరు?

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో నకిలీ పాసుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీటి ముద్రణపై SM ఇన్‌ఫ్లుయోన్సర్ల పాత్ర ఉందని వచ్చిన ఆరోపణలను వారు ఖండించారు. తాజాగా ఆలయానికి సమీప జిరాక్స్ షాపుల్లోనే ఈ ముద్రణ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. వేడుకల్లోని కార్యక్రమాలకు వేల సంఖ్యలో పుట్టుకొచ్చిన పాసులకు బాధ్యులెవరో(SM ఇన్‌ఫ్లుయోన్సర్ల? జిరాక్స్ షాపుల? ఇతరుల?) బయటపెట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 5, 2026
ఎచ్చెర్ల: సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ B.Tech మొదటి సెమిస్టర్ పరీక్షల షెడ్యూలను ఆ విభాగం అధికారి డాక్టర్ ఎస్. ఉదయ భాస్కర్ బుధవారం సాయంత్రం విడుదల చేశారు. ఎగ్జామ్స్ ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు గమనించాలని అన్నారు.