News January 15, 2025
తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. కొత్తవి ఇస్తామన్న కమిటీ

పారిస్ ఒలింపిక్స్‌లో అందజేసిన పతకాలలో నాణ్యత లేదని అథ్లెట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. షూటర్ మనూ భాకర్ కూడా తన పతకాలు రంగు వెలిశాయని, తుప్పు పట్టాయని తెలిపారు. ఈ మెడల్స్‌ను త్వరలోనే రీప్లేస్ చేస్తామని IOC ప్రకటించింది. ఫ్రాన్స్ కరెన్సీని ముద్రించే ‘ఫ్రెంచ్ స్టేట్ మింట్’ కొత్త పతకాలను తయారుచేస్తుందని పేర్కొంది. కాగా విజేతల కోసం ప్రఖ్యాత ‘ఐఫిల్ టవర్’ ఇనుమును మిక్స్ చేసి 5,084 పతకాలను రూపొందించారు.
Similar News
News November 6, 2025
20న తిరుపతికి రాష్ట్రపతి

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 20, 21 తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్నారు. 20న తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆమె దర్శించుకుంటారు. 21న తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అదేరోజు శ్రీ వరాహస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News November 6, 2025
రాహుల్ ఆరోపించిన చోట కాంగ్రెస్‌కే అధిక ఓట్లు

హరియాణాలో భారీగా ఓటు చోరీ జరిగిందని నిన్న LoP రాహుల్ గాంధీ ECపై ఆరోపణలు గుప్పించడం తెలిసిందే. ములానా సెగ్మెంటు ఢకోలా గ్రామంలో ఒకే ఫొటో (బ్రెజిలియన్ మోడల్)తో 223 ఓట్లున్నట్లు చూపారు. అయితే 2024 పోలింగ్‌లో అక్కడ CONGకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల్లో BJPకి 275, CONGకు 602 ఓట్లు రాగా లోక్‌సభలో BJP కన్నా CONGకు 392 ఓట్లు ఎక్కువొచ్చాయి. 2019తో పోలిస్తే 2024లో కాంగ్రెస్‌కే అధిక ఓట్లు పడ్డాయి.
News November 6, 2025
20 ఏళ్ల తరువాత తొలిసారి అక్కడ పోలింగ్

బిహార్ భీమ్‌బంద్ ప్రాంతంలోని 7 పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రజలు 20 ఏళ్ల తరువాత తొలిసారి ఓట్లు వేశారు. 2005 JAN 5న తారాపూర్ దగ్గర భీమ్ బంద్ ప్రాంతంలో నక్సల్స్ పోలీసులు లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. పేలుడులో ముంగేర్ SP సురేంద్ర బాబు, ఆరుగురు పోలీసులు చనిపోయారు. అప్పటి నుంచి అధికారులు అక్కడ పోలింగ్ నిర్వహించడం లేదు. ఈసారి సాయుధ దళాలను మోహరించి పోలింగ్ జరిపారు. ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేశారు.


