News January 15, 2025
ఇది వెంకీ సార్ పొంగల్: అనిల్ రావిపూడి

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వస్తున్న స్పందన ఆనందం కలిగిస్తోందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మూవీ సక్సెస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వెంకటేశ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో తెలుసని, ఈ సంక్రాంతికి సరిగ్గా కుదిరిందని చెప్పారు. బెనిఫిట్ షోలకు ఫ్యామిలీస్ రావడం పెద్ద అచీవ్‌మెంట్ అని తెలిపారు. ఇది వెంకీ సార్ పొంగల్ అని పేర్కొన్నారు. సినిమాకు సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News September 8, 2025
కుల్గాం ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికుల వీరమరణం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఆపరేషన్ గడర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను అంతమొందించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు గాలింపు కొనసాగుతోందని వెల్లడించారు.
News September 8, 2025
‘ఆమె లేని లోకంలో నేను ఉండలేను’.. ప్రియుడి సూసైడ్

TG: ప్రేయసి మరణవార్తను తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల(D)లోని పాత కొమ్ముగూడెంలో జరిగింది. ఇంజినీరింగ్ విద్యార్థిని హితవర్షిణి ప్రేమలో విఫలమై నిన్న SECBADలో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది. ‘నా బంగారు తల్లి లేని లోకంలో బతకలేను. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. వచ్చే జన్మలో పెళ్లి చేసుకుంటా’ అంటూ లెటర్ రాసి వినయ్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News September 8, 2025
గాయం నుంచి కోలుకుంటున్న పంత్

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ గాయం నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ఆయన అందుబాటులోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గాయం నుంచి మరింత వేగంగా కోలుకునేందుకు పంత్ వైద్య నిపుణులను సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో క్రిస్ వోక్స్ విసిరిన బంతి పంత్ కాలికి బలంగా తగిలింది. దీంతో ఆయన విలవిల్లాడుతూ వెంటనే మైదానాన్ని వీడారు.