News March 17, 2024

జెండాలు వేరైనా.. మా అజెండా ఒక్కటే: చంద్రబాబు

image

AP: జెండాలు వేరైనా.. టీడీపీ, జనసేన, బీజేపీ అజెండా ఒక్కటేనని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం సభలో వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వమే. ఐదేళ్లలో విధ్వంస, అహంకార, అవినీతి పాలనతో ప్రజల జీవితాలు నాశనమయ్యాయి. ఎన్నికల్లో మీరిచ్చే తీర్పే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణే మా అజెండా’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Similar News

News April 3, 2025

మంత్రివర్గంలో మైనార్టీలకి చోటు: టీపీసీసీ చీఫ్

image

TG: మంత్రి వర్గ విస్తరణ అనేది AICC పరిధిలోని అంశమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ అన్నారు. క్యాబినెట్‌ విస్తరణలో మైనార్టీలకి అవకాశం కల్పిస్తామన్నారు. కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని, HCU భూములని అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లలో తమిళనాడు తరహాలోనే తెలంగాణకు మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

News April 3, 2025

పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది: సునీత

image

AP: YCP అధినేత జగన్‌పై MLA పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది. ఆ కేసులో CBI ఆయన్ను విచారించింది. రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారు. ఓబుల్‌రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారు. ఆ సోదరుల మాటలు నమ్మి కుట్రలో భాగస్వామ్యం కావొద్దు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిచ్చుపెట్టొద్దు జగన్’ అని సునీత హెచ్చరించారు.

News April 3, 2025

గిల్‌పై కోహ్లీ ఫ్యాన్స్ ఫైర్!

image

నిన్నటి మ్యాచులో ఆర్సీబీపై విజయం తర్వాత గుజరాత్ కెప్టెన్ గిల్ చేసిన పోస్ట్ కోహ్లీ ఫ్యాన్స్‌‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. మ్యాచ్ అనంతరం ‘అరవడంపై కాదు ఆట మీదే మా ధ్యాసంతా’ అని గిల్ ట్వీట్ చేశారు. అంతకుముందు గిల్ ఔటయ్యాక కోహ్లీ బిగ్గరగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిని ఉద్దేశించే గిల్ పోస్ట్ చేశారని, టీమ్ ఇండియాలో మోస్ట్ ఓవర్ రేటెడ్ ప్లేయర్ ఆయనే అంటూ కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

error: Content is protected !!