News January 15, 2025
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ ఇవాళ, రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. పార్టీ అధిష్ఠానంతో క్యాబినెట్ విస్తరణ తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. అలాగే పలువురు కేంద్ర మంత్రులనూ ఆయన కలవనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటన అనంతరం సింగపూర్‌కు వెళ్లనున్న ఆయన ఈనెల 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. ఆ తర్వాత 20 నుంచి 22 వరకు దావోస్‌లో పర్యటిస్తారు.
Similar News
News September 9, 2025
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా దేవుజీ

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా కరీంనగర్ జిల్లాకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ నియమితులయ్యారు. నంబాల కేశవరావు మరణం తర్వాత సెక్రటరీ పోస్టు ఖాళీగా ఉంది. దేవుజీని నియమిస్తూ మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన సెంట్రల్ మిలటరీ కమిషన్ చీఫ్‌గా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల మరణించారు.
News September 9, 2025
ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు: TDP

AP: రెండేళ్ల క్రితం ఇదేరోజున తమ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టయిన విషయాన్ని గుర్తుచేస్తూ TDP ట్వీట్ చేసింది. ‘SEP 9, 2023 ప్రతి తెలుగువాడు తల్లడిల్లిన రోజు. ఓ నియంత వ్యవస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేసి రాక్షసానందం పొందిన రోజు. నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందో వారికి ఆరోజు తెలియలేదు. ఆయనకు మద్దతుగా ప్రజలు ఉద్యమించి CBNను విజేతగా నిలిపారు’ అని పేర్కొంది.
News September 9, 2025
నేపాల్ రణరంగం.. దుబాయ్ పారిపోయేందుకు PM ప్లాన్

నేపాల్‌లో సోషల్ మీడియాను పునరుద్ధరించినా నిరసనకారుల్లో ఆగ్రహజ్వాలలు చల్లారడం లేదు. ప్రజాప్రతినిధుల ఇళ్లే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. దీంతో PM కేపీ ఓలీ దుబాయ్ పారిపోవాలని చూస్తున్నట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు తెలుస్తోంది. అటు నిరసనకారులు మాజీ డిప్యూటీ ప్రధాని ఇంటిపై రాళ్ల దాడి చేశారు. అధికార పార్టీ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేబా ఇంటిని తగులబెట్టారు.