News January 15, 2025

తూ.గో: పందేలలో పచ్చకాకిదే హవా

image

ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేళ కోడి పందేల జోరు మామూలుగా లేదు. అయితే అదృష్టాన్ని, సత్తాను పరీక్షించుకునే ఈ కోడి పందేలకు సైతం శాస్త్రాలు, ముహూర్తాలు ఉంటాయని పందెం రాయుళ్లు చెబుతున్నారు. ఈ మేరకు కుక్కుట శాస్త్రం ప్రకారం మంగళవారం జరిగిన కోడి పందేల్లో పచ్చ కాకి రంగు కోడి పుంజులు ఎక్కువగా గెలుపొందినట్లు తెలుస్తోంది.

Similar News

News March 3, 2026

సీతానగరం మండలంలో యాక్సిడెంట్

image

సీతానగరం మండలం శ్రీరామనగరం చిట్టిబాబాజీ ఆశ్రమం వద్ద మంగళవారం సాయంత్రం 2 బైకులు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రఘుదేవపురం పంచాయతీ కంచుమర్తి వారిపేటకు చెందిన మత్తాల స్టీఫెన్ ఆనంద్(15) నడుపుతున్న బైకు రాపాకకు చెందిన దంపతుల వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన స్టీఫెన్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 2, 2026

పోలీస్ పీజీఆర్ఎస్‌లో 31 అర్జీలు: ఎస్పీ నర్సింహ కిషోర్

image

రాజమండ్రి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజిఆర్ఎస్ జరిగింది. ఎస్పీ డి.నరసింహ కిషోర్ అధికారులతో కలిసి బాధితుల నుంచి 31 అర్జీలను స్వీకరించారు. కిషోర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం బాధితులకు ఎంతో తోడ్పాటును అందిస్తోందన్నారు. వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.

News March 1, 2026

రేపు PGRS, రెవిన్యూ క్లినిక్: కలెక్టర్ కీర్తి

image

రాజమండ్రి కలెక్టరేట్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్‌లను యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ప్రకటించారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాలకు 1100కు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.