News March 17, 2024

సీఎం జగన్‌కు గుణపాఠం నేర్పాలి: సత్యకుమార్

image

AP: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీఎం జగన్‌కు రాష్ట్ర ప్రజలు గుణపాఠం నేర్పాలని బీజేపీ నేత సత్యకుమార్ అన్నారు. ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సభ.. గొడ్డలిపోటు వేసినవారికి గుండెపోటు తెప్పించాలి’ అని తెలిపారు. ‘వైసీపీ పాలన అవినీతిమయం. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారింది. రాష్ట్రాన్ని సీఎం జగన్ అప్పుల్లో ముంచారు. ప్రజాగళం సభ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తుంది’ అని సోమువీర్రాజు మాట్లాడారు.

Similar News

News December 23, 2024

మావోయిస్టు కీల‌క స‌భ్యుడు ప్ర‌భాక‌ర్ రావు అరెస్టు

image

నార్త్ బ‌స్త‌ర్ రీజియ‌న్‌లో మావోయిస్టు సంస్థ కీల‌క స‌భ్యుడు, తెలంగాణ‌లోని బీర్పూర్‌కు చెందిన ప్ర‌భాక‌ర్ రావు అలియాస్ బ‌ల్మూరి నారాయ‌ణ రావు (57)ను ఛ‌త్తీస్‌గ‌ఢ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న‌పై రూ.25 ల‌క్ష‌ల రివార్డు ఉంది. ప్ర‌భాక‌ర్ రావు క‌ద‌లిక‌ల‌పై నిఘా పెట్టిన పోలీసులు క‌ణ్కేర్ జిల్లా ప‌రిధిలో అరెస్టు చేశారు. 40 ఏళ్లుగా ద‌ళంలో ఉన్న ప్ర‌భాక‌ర్ రావు మావోల MOPOS టీంలో కీల‌కమని పోలీసులు తెలిపారు.

News December 23, 2024

VIRAL: షమీ-సానియా పెళ్లి ఫొటోలు.. నిజమిదే

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ షమీ తన భార్యతో, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్తతో కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే షమీ, సానియా పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా కొన్ని ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఏఐ రూపొందించిన ఫొటోలే. కొందరు కావాలనే షమీ, సానియా పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటోలను ఏఐతో డిజైన్ చేశారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు.

News December 23, 2024

SSA ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. హనుమకొండలో దీక్ష చేస్తున్న SSA ఉద్యోగులను ఆయన కలిశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తాము రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, రూ.7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.