News January 15, 2025
సంక్రాంతి మూవీస్: ఏ సినిమా బాగుంది?

ఈ సారి సంక్రాంతికి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, 14న వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో ఈ సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మీరు ఏ సినిమా చూశారు? ఏ సినిమా బాగుందో కామెంట్ చేయండి?
Similar News
News July 5, 2025
పిల్లలు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం: CM

TG: పిల్లలు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ అన్నారు. HYDలో పోక్సో చట్టంపై జరిగిన స్టేట్ లెవెల్ మీట్లో ఆయన పాల్గొన్నారు. SMను దుర్వినియోగం చేస్తూ పిల్లలు, మహిళలపై దుర్మార్గంగా వ్యవహరించే వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. భాగస్వాములందరితో కలిసి ఈ దిశగా పని చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
News July 5, 2025
దారుణం.. భార్య చేతిలో మరో భర్త బలి

TG: ప్రియుడి మోజులో భర్తల్ని భార్యలు చంపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. నారాయణపేట (D) కోటకొండకు చెందిన అంజిలప్ప(32) తన భార్య రాధ చేతిలో హత్యకు గురైన విషయం తాజాగా పోలీసుల విచారణలో బయటపడింది. రాధకు ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడితో ఆమె ఫోన్ మాట్లాడుతుండటం చూసి భర్త మందలించాడు. ఈ క్రమంలో గత నెల 23న మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య గొంతు నులిమి చంపినట్లు విచారణలో తేలింది.
News July 5, 2025
ఏపీ పరిధిలోకి మధిర రైల్వే స్టేషన్?

APలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుండటంతో SCR పరిధిలో డివిజన్ల సరిహద్దులు మారనున్నాయి. SCRలో SEC, HYD, నాందేడ్ డివిజన్లు ఉండనుండగా, విశాఖ జోన్లోకి GNT, విజయవాడ, గుంతకల్లు వెళ్తాయి. TGలోని మోటమర్రి, మధిర, ఎర్రుపాలెం, గంగినేని, చెరువు మాధవరం స్టేషన్లు VJA పరిధిలోకి వెళ్తాయి. GNT పరిధిలోని విష్ణుపురం-పగిడిపల్లి(NLG, మిర్యాలగూడ), జాన్పహాడ్ సెక్షన్లు SECలో కలిపే ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరాయి.