News March 17, 2024

కర్నూలు: ఒకే రోజు 24 పోటీలు.. విజయం సాధించిన జట్లు ఇవే..

image

ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెప‌క్ తక్రా పోటీల‌ను ఆదోని ఆర్ట్స్ అండ్‌ సైన్స్ కళాశాల‌లో ఆదివారం నిర్వహించారు. ఒకే రోజు జ‌రిగిన 24 పోటీల్లో శ్రీకాకుళంపై రాయలసీమ యూనివర్సిటీ, జై నారాయణ వ్యాస్ విశ్వ విద్యాలయంపై కొచ్చిన్ విశ్వవిద్యాలయం, జైపూర్ నిర్వాణ‌ విశ్వ విద్యాలయంపై యూనివర్సిటీ ఆఫ్ కాలిక‌ట్‌, మాధవ్ యూనివర్సిటీ పింద్వరాపై మౌలానా ఆజాద్ జోడ్‌పూర్‌ విజయం సాధించాయి.

Similar News

News November 23, 2024

నంద్యాల: 143 మంది పోలీస్ సిబ్బంది బదిలీ

image

నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న 143 మంది పోలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఆయన మాట్లాడారు. పోలీసు సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యత, బదిలీల కౌన్సెలింగ్‌లో సూచనలు చేశారు. జిల్లాలో ఎవరైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News November 23, 2024

నంద్యాల: ‘టీచర్స్ సమావేశానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి’

image

డిసెంబర్ 7న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శనివారం నంద్యాల కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యాక్షన్ ప్లాన్‌పై వారికి దిశా నిర్దేశం చేశారు.

News November 23, 2024

నంద్యాల జిల్లా యువకుడికి 18వ ర్యాంక్

image

నంద్యాల జిల్లా యువకుడు ఆల్ ఇండియా ర్యాంక్‌తో సత్తా చాటాడు. దొర్నిపాడు మండలం రామచంద్రపురం గ్రామనికి చెందిన గడ్డిపాటి నాగరాజు కుమారుడు యశ్వంత్ కుమార్ చెన్నైలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు. ఈక్రమంలో ఆయన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్‌(IES) పరీక్ష రాశారు. ఇండియాలోనే 18వ ర్యాంక్ సాధించారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.