News January 15, 2025
GET READY.. 18న నవోదయ ప్రవేశ పరీక్ష

నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వట్టెం నవోదయ ప్రిన్సిపల్ పి.భాస్కర్ తెలిపారు. వెబ్‌సైట్ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
Similar News
News April 25, 2025
మరో 3 రోజుల్లో పాలమూరు యూనివర్సిటీ పరీక్షలు

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని UG 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 5 బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా మరో 3 రోజులే మిగిలి ఉంది. వివరాలకు www.palamuruuniversity.com వెబ్‌సైట్ చూడండి. ఇక ఫీజు రియంబర్స్‌మెంట్ కోసం PU పరిధిలోని MBNR, GDWL, NGKL, WNP, NRPTలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. SHARE IT
News April 25, 2025
గద్వాల: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి PS పరిధిలో జరిగింది. SI మహేశ్ తెలిపిన వివరాలు.. బొంకూరు గ్రామ వాసి K.మధు(34) బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. అనంతరం తనకు తెలిసిన వ్యక్తి రాముడికి ఫోన్ చేసి ‘మా తాతల ఆస్తి నాకు సరిగా పంచలేదు.. అందుకే పొలం వద్ద పురుగు మందు తాగి చనిపోతున్నా’ అని చెప్పాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదైంది.
News April 25, 2025
వనపర్తి: విషపూరిత ద్రవం తాగి చిన్నారి మృతి

వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలోని 9వ వార్డులో గురువారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీకి చెందిన వంశీ, గాయత్రి దంపతులకు ఆర్థిక(18 నెలలు), మణికంఠ పిల్లలు ఉన్నారు. సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటూ ఆర్థిక ఓ బాటిల్‌లో ఉన్న ద్రవాన్ని తాగింది. దీంతో చిన్నారి మృతిచెందింది. మణికంఠ కళ్లమీద ద్రవం పడటంతో బొబ్బలు వచ్చాయి. మణికంఠను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ ద్రవం ఏంటో తెలియరాలేదు.