News January 15, 2025

మెదక్: పోరాట యోధుడి జయంతి నేడు

image

1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్‌ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.

Similar News

News November 6, 2025

టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నేతలు

image

టీయూడబ్ల్యూజే రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం గురువారం ప్రగతి రిసార్ట్స్‌లో జరిగింది. ఈ సమావేశంలో మెదక్ జిల్లా అధ్యక్షుడు ఏ. శంకర్‌ దయాళ్‌ చారి, ప్రధాన కార్యదర్శి ఏ. సంతోష్ కుమార్ పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె. శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. జర్నలిస్టుల సమస్యలు, హక్కులు సహా పలు అంశాలపై చర్చించారు.

News November 6, 2025

మెదక్: అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలి: కలెక్టర్

image

అవినీతి నిర్మూలన లక్ష్యంగా పనిచేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అవినీతి జాడ్యాన్ని రూపుమాపాల్సిన బాధ్యత మనపైనే ఉందన్నారు. ప్రతి రోజు అవినీతి డబ్బుతో ఏసీబీకి దొరకడం బాధాకరమన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అధికారులు, సిబ్బంది బాధ్యత అన్నారు.

News November 6, 2025

నిజాంపేట: ALERT.. లింక్ క్లిక్ చేస్తే రూ.45 వేలు మాయం

image

ఆన్‌లైన్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్ఐ రాజేష్ సూచించారు. మండల కేంద్రానికి చెందిన మౌనిక ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా వచ్చిన ఫేక్ లింకును క్లిక్ చేయడంతో ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ.45 వేలు పోయినట్లు ఎస్ఐ తెలిపారు. సెల్ ఫోన్‌లో సంబంధం లేని లింకులను, బెట్టింగ్ యాప్‌ల జోలికి పోవద్దని ఎస్ఐ హెచ్చరించారు. అనుమానాస్పద లింకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.