News January 15, 2025
రోహిత్ పాకిస్థాన్‌కు వెళ్తాడు: బీసీసీఐ వర్గాలు
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్స్ ఫొటో షూట్, ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్‌కు వెళ్తారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోందని పేర్కొన్నాయి. ఒకవేళ హిట్ మ్యాన్ నిజంగానే పాక్‌కు వెళ్తే ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. ఫిబ్రవరి 19న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, భారత్VSపాక్ మ్యాచ్ 23న దుబాయిలో జరగనుంది.
Similar News
News January 15, 2025
బ్యాక్ టు హైదరాబాద్
సంక్రాంతి పండగ ముగియడంతో ప్రజలు మహానగర బాట పట్టారు. గత 3-4 రోజులుగా స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన వారంతా తిరుగుపయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రేపటి నుంచి ట్రాఫిక్ మరింత పెరగనుంది. అటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
News January 15, 2025
గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్?
AP: ఆన్‌లైన్ పైరసీ, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బందులు పడుతున్న గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో ఆ చిత్రం స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీప్లేస్ చేస్తున్నట్లు సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. వెంకీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను దిల్ రాజు నిర్మించారు.
News January 15, 2025
40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు.. ఉక్రెయిన్‌పై దాడి పెంచిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా మరో భారీ క్షిపణి దాడి చేసింది. 40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు విద్యుత్ కోతలు అమలు చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఉపకరిస్తున్న గ్యాస్, ఎనర్జీ సదుపాయాలే లక్ష్యంగా రష్యా ఈ దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్‌కు జర్మనీ మరో 60 Anti-Aircraft Missiles పంపనుంది.