News January 15, 2025

భారత మహిళా జట్టు విధ్వంసం.. 50 ఓవర్లలో 435 రన్స్

image

ఐర్లాండ్‌ మహిళా జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత్ విధ్వంసం సృష్టించింది. 50 ఓవర్లలో 435/5 స్కోర్ చేసింది. ప్రతికా రావల్(154), స్మృతి మంధాన(135) సెంచరీలతో చెలరేగగా, రిచా ఘోష్ 59, తేజల్ 28, హర్లీన్ 15 రన్స్ చేశారు. వన్డేల్లో టీమ్ ఇండియాకు ఇదే అత్యధిక స్కోర్. ఓవరాల్‌గా నాలుగో స్థానం. గతంలో కివీస్ ఉమెన్ 491/4, 455/5, 440/3 స్కోర్లు చేసి టాప్‌లో ఉంది.

Similar News

News February 3, 2026

మున్సి‘పోల్స్’: ప్రచార బరిలోకి ముఖ్యనేతలు

image

TG: పార్టీల ముఖ్యనేతలు రంగంలోకి దిగుతుండడంతో మున్సి‘పోల్స్’ ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. CM రేవంత్ మిర్యాలగూడలో రేపు తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. FEB 9 వరకు CM రోజుకో సభలో ప్రచారం చేస్తారు. ఇక ప్రచారాలను హోరెత్తించేలా BRS కదులుతోంది. KTR, హరీశ్ రావు పలు ర్యాలీలు, సభలు నిర్వహించనునున్నారు. అటు BJP తమకు పట్టున్న ఉత్తర TGపై దృష్టి సారించింది. పార్టీ జాతీయ నాయకులు, MP, MLAలను రంగంలోకి దించుతోంది.

News February 3, 2026

హెయిర్ గ్రోత్‌కి గుడ్డు పెంకుల మాస్క్

image

కోడిగుడ్డు పెంకులను వాడటం వల్ల జుట్టు ఆరోగ్యం బావుంటుందని నిపుణులు చెబుతున్నారు. కోడి పెంకులను మెత్తటి పొడిలా చేసి కొబ్బరి నూనెలో కలిపి మాడుకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే చాలు. వారానికోసారి ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది. ఆలివ్‌ నూనెలో ఒక స్పూన్‌ పెంకుల పొడి కలిపి తలకు పట్టించాలి. తర్వాత తలస్నానం చెయ్యాలి. గుడ్డు పెంకులోని పోషకాలు చుండ్రు, దురదను తగ్గిస్తాయి.

News February 3, 2026

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>ఆల్ <<>>ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)33 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి డిగ్రీ, BE/BTech/MCA/BSc, డిప్లొమా, MCom/MBA, MSc(నర్సింగ్), BCom/BBA, BSc(బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), డిగ్రీ(యోగా), DMLT, పంచకర్మ(డిప్లొమా), ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 3. వెబ్‌సైట్: https://aiia.gov.in