News January 15, 2025
ITR దాఖలుకు ఇవాళే చివరి తేదీ

2023-24కు గాను ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇవాళే చివరి తేదీ. లేట్, రివైజ్డ్ రిటర్న్స్‌ను రాత్రి 12 గంటల్లోపు దాఖలు చేయాలి. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. నేడు ITR దాఖలు చేయకపోతే లీగల్ నోటీసులు, జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
Similar News
News January 13, 2026
భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారు?

దక్షిణాయనంలో సూర్యుడు దూరమవ్వడం వల్ల చలి విపరీతంగా పెరుగుతుంది. ఆ చలిని తట్టుకోవడానికి, ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ ఈ మంటలు వేస్తారు. ఈ మంటలు చలి నుంచి రక్షణనిస్తూ శరీరానికి వెచ్చదనం ఇస్తాయి. అలాగే గతేడాది పడిన కష్టాలు, బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేసి, రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలు ప్రసాదించమని కోరుతూ ఈ మంటలు వేస్తారు. నూతన వెలుగులతో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ భోగి మంటల అసలైన ఉద్దేశం.
News January 13, 2026
‘లైట్ ట్రాప్స్’తో సుడిదోమ, పచ్చదోమ కట్టడి

కొన్ని రకాల పురుగులు పంటలకు రాత్రి పూట కూడా హాని చేస్తుంటాయి. ఇలాంటి కీటకాలు రాత్రివేళ లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. ఇలాంటి కీటకాలను ఆకర్షించి అంతంచేసేవే ‘లైట్ ట్రాప్స్’. ముఖ్యంగా వరిలో సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. లైట్‌తో పాటు ఒక టబ్‌లో నీటిని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్‌కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్లలో పడి చనిపోతాయి.
News January 13, 2026
పెరగనున్న చలి

AP: సంక్రాంతి వేళ చలి తీవ్రత పెరగనుందని వాతావరణశాఖ అంచనా వేసింది. కొమరిన్ తీర పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ చాలా చోట్ల మేఘాలు ఆవరించే అవకాశం ఉందని చెప్పింది. ఫలితంగా పగలు చల్లని వాతావరణం ఉంటుందని తెలిపింది. రేపటి నుంచి ఆకాశం నిర్మలంగా మారి చలి పెరుగుతుందని, నాలుగైదు రోజులు ఇలాగే కొనసాగుతుందని పేర్కొంది. అటు నిన్న రాయలసీమ, కోస్తాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే.


