News January 15, 2025

‘డాకు మహారాజ్’ మూడు రోజుల కలెక్షన్లు ఎంతంటే?

image

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.92 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్‌తో కూడిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి తప్పకుండా చూడాలి అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు. ఈ సినిమాను చూశారా? COMMENT

Similar News

News January 15, 2025

GOOD NEWS: IBPS జాబ్ క్యాలెండర్ విడుదల

image

బ్యాంకు ఉద్యోగార్థులకు IBPS గుడ్ న్యూస్ చెప్పింది. 2025-26లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది. RRBలో ఆఫీసర్ స్కేల్ 1, 2, 3, ఆఫీస్ అసిస్టెంట్, PSBలో ప్రొబెషనరీ ఆఫీసర్/మేనేజ్‌మెంట్ ట్రైనీ, స్పెషలిస్ట్ ఆఫీసర్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాలకు సంబంధించిన జాబితా ఇందులో ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇతర పూర్తి వివరాల కోసం <>https://www.ibps.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.

News January 15, 2025

బ్యాక్ టు హైదరాబాద్

image

సంక్రాంతి పండగ ముగియడంతో ప్రజలు మహానగర బాట పట్టారు. గత 3-4 రోజులుగా స్వస్థలాల్లో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసిన వారంతా తిరుగుపయనమయ్యారు. దీంతో విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. రేపటి నుంచి ట్రాఫిక్ మరింత పెరగనుంది. అటు ఏపీ, తెలంగాణ జిల్లాల్లోని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

News January 15, 2025

గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్?

image

AP: ఆన్‌లైన్ పైరసీ, ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బందులు పడుతున్న గేమ్ ఛేంజర్ మూవీకి మరో షాక్ తగలనున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని థియేటర్లలో ఆ చిత్రం స్థానంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ను రీప్లేస్ చేస్తున్నట్లు సినీ జర్నలిస్టులు చెబుతున్నారు. వెంకీ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలను దిల్ రాజు నిర్మించారు.