News January 15, 2025

పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టులో ఊరట

image

తప్పుడు పత్రాలతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజా ఖేడ్కర్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. వచ్చే నెల 14 వరకు ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం, యూపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు <<14959397>>కొట్టేయడంతో<<>> సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Similar News

News January 15, 2025

కేంద్ర మంత్రులతో శ్రీధర్‌బాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

TG: కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గజేంద్ర సింగ్‌తో రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు ఢిల్లీలో సమావేశమయ్యారు. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణకు సహకరించాలని వైష్ణవ్‌ను కోరారు. ఫిబ్రవరి 24న హైదరాబాద్‌లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, రామగిరి ఫోర్ట్‌ల అభివృద్ధికి సహకరించాలని గజేంద్ర సింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

News January 15, 2025

ఈ OTTలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్ట్రీమింగ్!

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను తెగ మెప్పిస్తోంది. నవ్వులు పూయించే ఈ సినిమాను చూసేందుకు వృద్ధులు సైతం థియేటర్‌కు వెళ్లిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, ఈ చిత్ర ఓటీటీ హక్కులను ‘ZEE5’దక్కించుకుంది. 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఇంతకీ మీరు ఈ సినిమా చూశారా?

News January 15, 2025

మనోజ్‌పై చర్యలు తీసుకోండి.. మోహన్ బాబు ఫిర్యాదు

image

AP: కుమారుడు మంచు మనోజ్‌పై మోహన్‌బాబు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 200 మందితో మోహన్ బాబు వర్సిటీలోకి <<15163428>>ప్రవేశించేందుకు<<>> మనోజ్ ప్రయత్నించారని తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లొద్దని పోలీసులు చెప్పినా వినలేదన్నారు. డైరీఫాం గేటు దూకి లోపలకి ప్రవేశించారని పేర్కొన్నారు.