News January 15, 2025

430 విజయాలు.. చరిత్ర సృష్టించిన జకోవిచ్

image

ఆస్ట్రేలియా ఓపెన్ మూడో రౌండ్‌కు చేరుకున్న సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించారు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో అత్యధిక మ్యాచ్‌లు(430) గెలిచిన ప్లేయర్‌గా ఘనత సాధించారు. గతంలో ఫెదరర్(429) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. జకోవిచ్ ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్(24)లను గెలిచిన ప్లేయర్‌గానూ కొనసాగుతున్నారు. ఇందులో 10 ఆస్ట్రేలియా ఓపెన్, 7 వింబుల్డన్, 4 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్‌లు ఉన్నాయి.

Similar News

News September 12, 2025

ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించాం: బుగ్గన

image

AP: రాబోయే పదేళ్లను దృష్టిలో పెట్టుకొని తమ హయాంలో ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించామని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. విజయవాడలో జరుగుతున్న Way2News కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు లేకుండా అప్పులు చేస్తోందని ఆరోపించారు. 2019-24 మధ్య YCP రూ.3లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసిందన్నారు.

News September 12, 2025

అప్పులు ఆంధ్రాలో మాత్రమే పెరగలేదు: బుగ్గన

image

ఆంధ్రప్రదేశ్‌లో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్‌గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గడచిన పదేళ్లలో కేంద్రం సహా చాలా రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయని Way2News కాన్‌క్లేవ్‌లో వెల్లడించారు. అప్పటి కరోనా సహా ఇతర పరిస్థితులతో సరైన ఉపాధి, ఆదాయ అవకాశాలు లేవని తెలిపారు. ఇక విభజన తర్వాత చాలా కీలకమైన మొదటి 5 సంవత్సరాలు ఏ పనినీ సరిగా చేయలేకపోయారని ఆరోపించారు.

News September 12, 2025

VIRAL: ‘మిరాయ్’లో ప్రభాస్ లుక్‌పై క్లారిటీ!

image

తేజా సజ్జ ‘మిరాయ్’ సినిమా పాజిటివ్ టాక్‌ తెచ్చుకుని ప్రేక్షకులను మెప్పిస్తోంది. అయితే ఈ చిత్రంలో చివర్లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం SMలో జోరుగా సాగింది. చాలా మంది రాముడి లుక్‌లో ఉన్న ప్రభాస్ ఫొటోను కూడా షేర్ చేశారు. అయితే ఇదంతా ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఫొటో అని గ్రోక్‌తో పాటు సినిమా చూసినవారు చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ మాత్రమే ఇచ్చినట్లు క్లారిటీ ఇస్తున్నారు.