News January 15, 2025
ఆస్కార్ అవార్డులు రద్దు? 96 ఏళ్లలో ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చును ఆర్పడం ఎవరివల్లా కావడం లేదు. ఇంతింతగా పెరుగుతున్న మంటల నుంచి ప్రజలను రక్షించేందుకు అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, ఈ కార్చిచ్చు ‘ఆస్కార్’ను తాకేలా కనిపిస్తోంది. దీనివల్ల ‘ఆస్కార్-2025’ ఈవెంట్ రద్దు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే నామినేషన్స్ ప్రకటన కూడా వాయిదా పడింది. ఒకవేళ రద్దయితే 96 ఏళ్లలో ఇదే తొలిసారి కానుంది.
Similar News
News January 16, 2025
శుభ ముహూర్తం (16-01-2025)
✒ తిథి: బహుళ తదియ తె.4.25 వరకు
✒ నక్షత్రం: ఆశ్లేష మ.12.02 వరకు
✒ శుభ సమయం: ఏమి లేవు
✒ రాహుకాలం: ప.1.30-3.00 వరకు
✒ యమగండం: ఉ.6.00-7.30 వరకు
✒ దుర్ముహూర్తం: 1.ఉ.10.00-10.48 వరకు
2.మ.2.48-3.36 వరకు
✒ వర్జ్యం: రా.12.42-2.23 వరకు
✒ అమృత ఘడియలు: ఉ.10.22-12.01 వరకు
News January 16, 2025
TODAY HEADLINES
✒ వార్ షిప్స్, జలాంతర్గామిని ప్రారంభించిన PM
✒ కొత్త ఆఫీస్ లైబ్రరీకి మన్మోహన్ పేరు: INC
✒ హైకోర్టులకు కొత్త జడ్జిలు.. TGకి నలుగురు, APకి ఇద్దరు
✒ స్కిల్ కేసు: CBN బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
✒ తిరుమలలో టికెట్ల స్కామ్.. ఐదుగురు అరెస్ట్
✒ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
✒ TG: ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు EAPCET
✒ TG: ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్
News January 16, 2025
సొంత ఇల్లు, కారు లేవు.. అఫిడవిట్‌లో కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేసిన కేజ్రీవాల్ తనకు రూ.1.73 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ.2.96లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు ఉన్నట్లు ప్రకటించారు. స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లని తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని అందులో పొందుపర్చారు. న్యూఢిల్లీ నుంచి బరిలో నిలిచిన కేజ్రీవాల్ 2020 ఎన్నికల్లో తన ఆస్తుల విలువను రూ.3.4 కోట్లుగా ప్రకటించారు.