News January 15, 2025
కర్నూలు: కవలల ఇంట సంక్రాంతి కాంతులు

ఒకేసారి కవలలు అంటే కాస్త ఆశ్చర్యం, కానీ రెండోసారి కవల పిల్లలంటే అద్భుతమే అని చెప్పాలి. కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ఫక్కీరప్ప, కృపావతి దంపతులు మొదట ఇద్దరు ఆడపిల్లలు, రెండోసారి ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయిల పేర్లు స్నేహ, శ్వేత కాగా అబ్బాయిల పేర్లు అఖిల్, నిఖిల్‌గా నామకరణం చేశారు. కవల పిల్లలతో సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
Similar News
News January 15, 2026
కర్నూలు: ‘యువకుడి మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే చెప్పండి’

కర్నూలు(M) పంచలింగాల డెయిరీ ఫారం నిర్వహిస్తున్న బ్రహ్మానంద రెడ్డి(30) నిన్న తెల్లవారుజామున నుంచి కనిపించకుండా పోయాడు. రోజూలాగే పాలు పోసేందుకు వెళ్లిన బ్రహ్మానంద రెడ్డి తిరిగి రాలేదని కుటుంబసభ్యులు తెలిపారు. కేసీ కెనాల్ సమీప హైవేపై అతని బైక్ నిలిపి ఉన్నట్లు గుర్తించారు. కర్నూలు 4వ పట్టణ PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సీఐ విక్రమ్ సింహ తెలిపారు.
News January 15, 2026
‘ఆదోనికి మీరే దిక్కు సీఎం చంద్రబాబూ..’

ఆదోని జిల్లా సాధన కోసం చేపట్టిన దీక్ష ఇవాళ 60వ రోజుకు చేరుకున్న సందర్భంగా సంతేకుడ్లూరు గ్రామ యువతతో పాటు జేఏసీ నాయకులు దీక్షలో పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు దిక్కు అంటూ కళాకారుడు జగదీశ్ వేసిన చిత్రం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో జేఏసీ నాయకులు నూర్ అహ్మద్, షకీల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
News January 15, 2026
‘ఆదోని వైసీపీ కౌన్సిలర్లకు తగిన గుణపాఠం చెప్పాలి’

ఆదోని పట్టణ అభివృద్ధిని వైసీపీ కౌన్సిలర్లు అడ్డుకుంటూ కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు అంటగట్టే ప్రయత్నాన్ని ప్రజలు తిప్పి కొడతారని టీడీపీ మాజీ కౌన్సిలర్ మారుతి, టీడీపీ నాయకుడు మల్లికార్జున బుధవారం అదోనిలో తెలిపారు. ఎమ్మెల్యే పార్థసారథి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదోని అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వైసీపీ కౌన్సిలర్లు మున్సిపల్ బడ్జెట్‌ను ఆమోదించకుండా అడ్డుకోవడం తగదన్నారు.


