News January 15, 2025
EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్‌లో పొలిటికల్ వార్
MP భోపాల్‌లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్‌నాథ్ సర్కార్ కరప్షన్‌కు మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.
Similar News
News January 16, 2025
కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్
హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.
News January 16, 2025
ఆరు వారాలే ఒప్పందం!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమలులో ఉండనున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడనున్నాయి. దీంతో పాటు ఇరు వర్గాలు బందీలను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకారం తెలిపాయని వెల్లడించాయి.
News January 16, 2025
జనవరి 16: చరిత్రలో ఈ రోజు
1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి జననం
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం