News January 16, 2025

BREAKING: కాటసాని అనుచరులపై మంత్రి బీసీ అనుచరుల దాడి

image

బనగానపల్లెలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాటసాని రామిరెడ్డి అనుచరుడు మొహమ్మద్ ఫైజ్ కుటుంబంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారంటూ పోలీస్ స్టేషన్‌లో రామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఫైజ్ కుమారుడి వివాహంలో కెమెరామెన్లు డ్రోన్లతో షూట్ చేస్తుండగా మంత్రి కాంపౌండ్‌‌లోకి డ్రోన్ వెళ్లిందంటూ కెమెరామెన్లను కొట్టారని, అదే సమయంలో ఫైజ్ కుటుంబంపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News January 16, 2025

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ బుధవారం ప్రకటనలో పేర్కొన్నారు. మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అవుతుందని, వెంటనే apk ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయమంటూ వచ్చే మెసేజులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. మీరు కూడా ఎంతో తేలికగా ఆ గేమ్ ఆడి డబ్బులు సంపాదించవచ్చు అనే ప్రకటనలు చూసి మోసపోవద్దన్నారు. నేరాలపై 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.

News January 15, 2025

కర్నూలు: కవలల ఇంట సంక్రాంతి కాంతులు

image

ఒకేసారి కవలలు అంటే కాస్త ఆశ్చర్యం, కానీ రెండోసారి కవల పిల్లలంటే అద్భుతమే అని చెప్పాలి. కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ఫక్కీరప్ప, కృపావతి దంపతులు మొదట ఇద్దరు ఆడపిల్లలు, రెండోసారి ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. అమ్మాయిల పేర్లు స్నేహ, శ్వేత కాగా అబ్బాయిల పేర్లు అఖిల్, నిఖిల్‌గా నామకరణం చేశారు. కవల పిల్లలతో సంక్రాంతిని సంతోషంగా జరుపుకున్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

News January 15, 2025

పండగ రోజు విషాదం.. వెల్దుర్తిలో చిన్నారి మృతి

image

కర్నూలు బెంగళూరు 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయ. గిరి (10) అనే బాలుడు దుర్మరణం చెందాడు. వెల్దుర్తి ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు, కళ్యాణిల కుమారుడు గిరి రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యప్తు చేపట్టారు.