News January 16, 2025
నిద్రలో వచ్చే కలల గురించి కొన్ని నిజాలు

ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు రావడం సహజం. అవి ఎందుకు వస్తాయో కచ్చితమైన ఆధారాలేవీ లేవు. కలల గురించి కొన్ని నిజాలు..
✒ ప్రతి నిద్రలో 3-6 కలలు వస్తాయి.
✒ ఒక్కో కల 5- 20ని.లు ఉంటుంది.
✒ నిద్రలేచే సరికి 95% కలలు గుర్తుండవు.
✒ మనకు తీరని కోరికలే కలలుగా వస్తాయి.
✒ కలల వల్ల మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి.
✒ ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల అంధులకు కలలు ఎక్కువగా వస్తాయి.
Similar News
News September 11, 2025
నేటి ముఖ్యాంశాలు

* దసరా రోజున ఆటోడ్రైవర్లకు రూ.15,000: CM
* నేపాల్లో ఉన్న ఏపీ వారిని ప్రత్యేక విమానంలో తరలింపు: లోకేశ్
* చంద్రబాబు బావిలో దూకి చావాలి: జగన్
* TG: గత పాలకులు దోచుకున్న సొమ్ము రికవరీ చేస్తాం: కోమటిరెడ్డి
* రేవంత్ బీజేపీ సీఎం అని ముస్లింలు గుర్తించాలి: KTR
* కిషన్రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా: రాజాసింగ్
*ఆసియా కప్లో భారత్ బోణీ.. UAEపై ఘన విజయం
News September 11, 2025
10 లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్

TG: భూభారతి చట్టం కింద సాదా బైనామా (నమోదు కాని లావాదేవీలు) క్రమబద్ధీకరణకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్ల దాదాపు 10 లక్షల మంది రైతులు భూ యాజమాన్య హక్కులను పొందుతారని ప్రకటనలో తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, 2020లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు సమర్పించిన రైతుల సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని పేర్కొంది.
News September 11, 2025
గణేశ్ వేడుకల్లో అసభ్యప్రవర్తన.. 1,612 మందిని పట్టుకున్న షీటీమ్స్

TG: గణేశ్ వేడుకల్లో మహిళలతో 1,612 మంది అసభ్యంగా ప్రవర్తించినట్లు షీటీమ్స్ గుర్తించింది. వీరిలో 68 మంది మైనర్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని వెల్లడించింది. 168 మందిపై ‘పెట్టీ’ కేసులు నమోదు చేసి వీరిలో 70 మందిని కోర్టులో హాజరుపరచామని తెలిపింది. మరో 1,444 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొంది.
*షీటీమ్స్ సాయానికి డయల్ 100/వాట్సాప్ 9490616555