News January 16, 2025

సొంత ఇల్లు, కారు లేవు.. అఫిడవిట్‌లో కేజ్రీవాల్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేసిన కేజ్రీవాల్ తనకు రూ.1.73 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ.2.96లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు ఉన్నట్లు ప్రకటించారు. స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లని తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని అందులో పొందుపర్చారు. న్యూఢిల్లీ నుంచి బరిలో నిలిచిన కేజ్రీవాల్ 2020 ఎన్నికల్లో తన ఆస్తుల విలువను రూ.3.4 కోట్లుగా ప్రకటించారు.

Similar News

News September 11, 2025

10 లక్షల మంది రైతులకు గుడ్ న్యూస్

image

TG: భూభారతి చట్టం కింద సాదా బైనామా (నమోదు కాని లావాదేవీలు) క్రమబద్ధీకరణకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియ వల్ల దాదాపు 10 లక్షల మంది రైతులు భూ యాజమాన్య హక్కులను పొందుతారని ప్రకటనలో తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం, 2020లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు దరఖాస్తులు సమర్పించిన రైతుల సాదా బైనామాలను క్రమబద్ధీకరించాలని పేర్కొంది.

News September 11, 2025

గణేశ్ వేడుకల్లో అసభ్యప్రవర్తన.. 1,612 మందిని పట్టుకున్న షీటీమ్స్

image

TG: గణేశ్ వేడుకల్లో మహిళలతో 1,612 మంది అసభ్యంగా ప్రవర్తించినట్లు షీటీమ్స్ గుర్తించింది. వీరిలో 68 మంది మైనర్లు ఉన్నారని పేర్కొంది. ఎక్కువ మంది 18-30 ఏళ్లలోపు వారేనని వెల్లడించింది. 168 మందిపై ‘పెట్టీ’ కేసులు నమోదు చేసి వీరిలో 70 మందిని కోర్టులో హాజరుపరచామని తెలిపింది. మరో 1,444 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి వార్నింగ్ ఇచ్చినట్లు పేర్కొంది.
*షీటీమ్స్ సాయానికి డయల్ 100/వాట్సాప్ 9490616555

News September 10, 2025

‘అఖండ-2’కు OTT రైట్స్ @రూ.80కోట్లు?

image

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అఖండ-2’ మూవీ డిజిటల్ రైట్స్ రూ.80+ కోట్లు పలికినట్లు సినీ వర్గాలు తెలిపాయి. OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దీనిని దక్కించుకుందని పేర్కొన్నాయి. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ మూవీని డిసెంబర్‌ తొలివారంలో రిలీజ్ చేస్తామని ఇటీవల బాలయ్య తెలిపారు.