News January 16, 2025

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ట్రంప్

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య <<15166636>>కాల్పుల విరమణ<<>> ఒప్పందాన్ని యూఎస్‌కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. మిడిల్ ఈస్ట్‌లో బందీలను విడిపించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. త్వరలోనే వారు విడుదల అవుతారని ట్రూత్ సోషల్ నెట్‌వర్క్‌లో చెప్పారు. ఈ నెల 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Similar News

News January 7, 2026

పీసీఓడీ ఉంటే ఏమవుతుందంటే..

image

పీసీఓడీ ఉన్నవారిలో ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్, ఇన్సులిన్‌ వంటి హార్మోన్లు స్త్రీల ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. దీంతో ఊబకాయం, నెలసరి సమస్యలు, మొటిమలు, టైప్‌–2 డయాబెటిస్‌, బీపీ, కొలెస్ట్రాల్‌ పెరగడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో బాధితులు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకొనేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 7, 2026

కోరిన వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలంటే?

image

కోరిన వ్యక్తే జీవిత భాగస్వామి అవ్వాలంటే మనసుని, సంకల్పాన్ని ఏకం చేసే కామరాజ మంత్రం’ లేదా ‘కాత్యాయని వ్రతం’ చేయాలని పండితులు సూచిస్తున్నారు. ‘స్నానానంతరం పసుపు వస్త్రాలు ధరించి, లక్ష్మీనారాయణుల ఫొటో ముందు నెయ్యితో దీపం వెలిగించి కోరికను నివేదించాలి. గోమాతకు బెల్లం కలిపిన అరటిపండ్లు తినిపిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల ప్రేమ సఫలమై, ఆటంకాలు తొలగి కోరుకున్న వ్యక్తితో వివాహ బంధం బలపడుతుంది’ అంటున్నారు.

News January 7, 2026

అనంతపురం GMCలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

AP: అనంతపురంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ (<>GMC<<>>)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, MPHA(F), ఇంటర్ వొకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు, డిగ్రీ, 8వ తరగతి ఉత్తీర్ణులు అర్హులు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైకియాట్రిస్ట్‌కు నెలకు రూ.60వేలు, నర్సుకు రూ.11వేలు, కౌన్సిలర్‌కు రూ.12,500, వార్డ్ బాయ్‌కి రూ.11000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: ananthapuramu.ap.gov.in