News January 16, 2025

చిరు ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా: అనిల్ రావిపూడి

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News September 11, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఉదయం ఢిల్లీలో జరిగే ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. అనంతరం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం ఉ.9.30 గం.కు రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం సాయంత్రం అమరావతికి తిరిగి రానున్నారు.

News September 11, 2025

NCLTలో 32 పోస్టులు

image

నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(<>NCLT<<>>) స్టెనోగ్రాఫర్ 18, ప్రైవేట్ సెక్యూరిటీస్ 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన కంప్యూటర్ స్కిల్స్, టైపింగ్ నాలెడ్జ్ గల అభ్యర్థులు అక్టోబర్ 8వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టెనోగ్రాఫర్‌కు నెలకు రూ.45వేలు, ప్రైవేట్ సెక్యూరిటీకి రూ.50వేలు జీతం అందిస్తారు. వెబ్ సైట్: https://nclt.gov.in/

News September 11, 2025

పెట్టుపోతలకు చెక్ పెడదాం

image

మనదేశంలో చాలా పోరాటాల తర్వాత 1961లో వరకట్ననిషేధ చట్టం వచ్చింది. ఇందులో సెక్షన్ 2 ప్రకారం పెళ్లిలో విలువైన వస్తువులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తీసుకుంటే అది భార్య, వారసుల కోసమే వాడాలి. సెక్షన్ 3 ప్రకారం కట్నం తీసుకున్నట్లు రుజువైతే ఫైన్, జైలుశిక్ష పడుతుంది. సెక్షన్ 4 ప్రకారం కట్నం డిమాండ్ చేయడం నేరం. సెక్షన్ 6 ప్రకారం పెళ్లిలో తీసుకున్న ఆస్తి, డబ్బు 3నెలల్లో అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేయాలి.