News January 16, 2025
జనవరి 16: చరిత్రలో ఈ రోజు

1938: మల్ల యుద్ధ వీరుడు కోడి రామమూర్తి మరణం
1942: మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి జననం
1943: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి చౌదరి మరణం
1978: సినీ దర్శకుడు భీమ్ సింగ్ మరణం
1989: సినీ నటుడు ప్రేమ్ నజీర్ మరణం
Similar News
News October 26, 2025
ఫుడ్ పాయిజనింగ్ కావొద్దంటే ఇవి మస్ట్!

TG: రాష్ట్రంలో గత 9 నెలల్లో 34K+ ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదయ్యాయి. దీనికి కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్రతే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ‘బయటి ఫుడ్, ఫ్రిడ్జిలో నిల్వ ఉంచిన ఆహారం తినొద్దు. వాడిన నూనె మళ్లీ వాడొద్దు. శుభ్రత పాటించాలి. కాచి చల్లార్చిన నీరు తాగాలి. తినే ముందు, మలవిసర్జన తర్వాత సబ్బుతో చేతులు కడగాలి. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వస్తే వైద్యుడిని సంప్రదించాలి’ అని సూచిస్తున్నారు.
News October 26, 2025
OTTలోకి ‘కాంతార: ఛాప్టర్-1’ వచ్చేది అప్పుడేనా?

‘కాంతార ఛాప్టర్-1’ సినిమా ₹800Cr+ గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ హిందీ, కన్నడ భాషల్లో మంచి వసూళ్లు సాధిస్తోంది. కాగా ఈ సినిమా హిందీ వెర్షన్ మినహా మిగతా దక్షిణాది భాషల్లో ఈ నెలాఖరున OTT( అమెజాన్ ప్రైమ్ వీడియో)లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News October 26, 2025
VH ట్రోఫీలో RO-KO ఆడతారా? గిల్ ఏమన్నారంటే?

విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్, కోహ్లీ ఆడే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భారత కెప్టెన్ గిల్ తెలిపారు. SAతో ODI సిరీస్ అనంతరం సెలక్టర్లు దీనిపై RO-KOతో చర్చిస్తారని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లందరూ డొమెస్టిక్ టోర్నీల్లో ఆడాల్సిందేనని చీఫ్ సెలక్టర్ అగర్కర్ గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం రోహిత్, కోహ్లీని VH ట్రోఫీలో ఆడాలని సూచించే అవకాశముంది.


