News March 17, 2024

ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాం: మోదీ

image

ఏపీని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. బొప్పూడి సభలో మాట్లాడుతూ.. ‘రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాం తిరుపతిలో ఐఐటీ, ఐసర్, విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ, మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మించాం. విజయనగరం జిల్లాలో జాతీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకే ఈ సంస్థలను స్థాపించాం’ అని తెలిపారు.

Similar News

News December 23, 2024

SSA ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. హనుమకొండలో దీక్ష చేస్తున్న SSA ఉద్యోగులను ఆయన కలిశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తాము రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, రూ.7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

News December 23, 2024

థియేటర్లో పాప్‌కార్న్ తింటున్నారా..!

image

సినిమా హాల్లో ఇంటర్వెల్ అవ్వగానే పాప్‌కార్న్ తెచ్చుకొని తినడం చాలామందికి అలవాటు. మల్టీప్లెక్సుల్లో వీటిధర రూ.250-350 వరకూ ఉంటోంది. ఇప్పటికే అంత పెట్టలేక కస్టమర్లు లబోదిబో అంటున్నారు. తాజాగా GST మండలి వీటిపై పన్నును వర్గీకరించడంతో భారం మరింతకానుంది. లూజ్ పాప్‌కార్న్‌పై 5, ప్రీప్యాక్డ్‌పై 12, కారమెల్ వంటి షుగర్ కోటింగ్స్ వేస్తే 18% GST అమలవుతుంది. ఇకపై నాలుకకు తీపి తగలాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే.

News December 23, 2024

వారం రోజుల్లోనే OTTలోకి రాజమౌళి సినిమా!

image

దర్శకధీరుడు రాజమౌళిపై తెరకెక్కిన ‘RRR: Behind & Beyond’ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 20న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీలో చరణ్, ఎన్టీఆర్‌ సీన్స్‌తో పాటు ఇతర నటీనటుల చిత్రీకరణలో జక్కన్న పడిన కష్టాన్ని చూపారు.