News January 16, 2025
ముగిసిన పందేలు.. చేతులు మారిన వందల కోట్లు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్ల పందేలు ముగిశాయి. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతూ పందెంరాయుళ్లు సై అంటే సై అంటూ యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సాగిన పందేలు సుమారు రూ.500 కోట్లు పందేలు కాసినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. బుధవారం సాయంత్రంతో పందెం రాయుళ్లకు పోలీసులు పుల్ స్టాప్ పెట్టారు. పటమట కొత్తపేట అంపాపురం బరులను అధికారులు మూసివేశారు.
Similar News
News January 16, 2025
కృష్ణా: ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా డీసీసీబీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్‌ల పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. కృష్ణాజిల్లాలో 66 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను 17 పీఏసీఎస్ ఇన్ సర్వీసుల ఉద్యోగులకు కేటాయించారు. ఈనెల 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ప్రకటించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 16, 2025
ముగిసిన పందేలు.. చేతులు మారిన వందల కోట్లు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోళ్ల పందేలు ముగిశాయి. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతూ పందెంరాయుళ్లు సై అంటే సై అంటూ యథేచ్ఛగా పందేలు నిర్వహించారు. మూడు రోజుల పాటు సాగిన పందేల్లో సుమారు రూ.500 కోట్లు చేతులు మారినట్లుగా తెలుస్తోంది.. బుధవారం సాయంత్రంతో పందెం రాయుళ్లకు పోలీసులు పుల్ స్టాప్ పెట్టారు. పటమట కొత్తపేట అంపాపురం బరులను అధికారులు మూసివేశారు.
News January 16, 2025
విజయవాడలో పోలీసులపై దాడి అవాస్తవం: సీఐ
విజయవాడ శివారు జక్కంపూడిలో జూద శిబిరాలు ఖాళీ చేయించామని కొత్తపేట సీఐ కొండలరావు తెలిపారు. బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. జక్కంపూడిలో పోలీసులపై ఎటువంటి దాడి జరగలేదని ఎస్ఐ సివిల్ డ్రెస్‌లో ఉండటం వల్ల అక్కడ ఉన్న ఆకతాయిలు గుర్తుపట్టలేదని తెలిపారు. ప్రస్తుతం జూద శిబిరాన్ని ఖాళీ చేయించామని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఐ తెలిపారు. మరల జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.