News March 17, 2024

KMM: డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో రెగ్యులర్ డిగ్రీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీ విడుదల చేసినట్లు KU అధికారులు తెలిపారు. మార్చి 30 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. అలాగే ఏప్రిల్ 10 వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు మేలో ఉంటాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని డిగ్రీ విద్యార్థులు గమనించాలని కోరారు.

Similar News

News January 31, 2026

నగరంలో నాణ్యమైన ఫుట్‌పాత్‌లు: కలెక్టర్‌ అనుదీప్‌

image

ఖమ్మంలో పాదచారుల భద్రత కోసం అత్యుత్తమ నాణ్యతతో ఫుట్‌పాత్‌లు నిర్మించాలని కలెక్టర్‌ అనుదీప్‌ ఆదేశించారు. శనివారం SR&BGNRకళాశాల పరిసరాల్లో చేపట్టనున్న గ్రానైట్ ఫుట్‌పాత్ పనుల డిజైన్లను పరిశీలించారు. వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు ఇబ్బంది లేకుండా స్లోప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. నగర సుందరీకరణలో భాగంగా ప్రజలకు సౌకర్యవంతమైన నడక మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News January 31, 2026

మున్సిపల్ పోరు: నామినేషన్ల జోరు!

image

ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఉత్సాహంగా ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బరిలో నిలవడంతో నామినేషన్ల సంఖ్య భారీగా నమోదైంది. జిల్లావ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలను పరిశీలిస్తే, ఎదులాపురం మున్సిపాలిటీ 241 నామినేషన్లలో అగ్రస్థానంలో నిలిచింది.
* ఎదులాపురం 241
* వైరా 190
* మధిర 178
* కల్లూరు 159
* సత్తుపల్లి 155

News January 31, 2026

ఖమ్మం కార్పొరేషన్‌లో అవినీతి కంపు !

image

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది చేస్తున్న అవినీతి వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. శానిటేషన్ సెక్షన్ అధికారి తన కింద పని చేస్తున్న జవాన్ల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని, డబ్బులివ్వని వాళ్ల డివిజన్లు మారుస్తామని బెదిరిస్తున్నారు. మహిళా సిబ్బంది పట్ల ఆయన ప్రవర్తనపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉన్న KMCలో ఈ పరిస్థితిపై చర్చ జరుగుతోంది.