News January 16, 2025

3 రోజులు జాగ్రత్త

image

TGలో చలి తీవ్రత మరో మూడు రోజులు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పొగమంచు ప్రభావం ఉంటుందని తెలిపింది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో APలోని చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Similar News

News November 10, 2025

భాగ్యనగరంలో ₹304 కోట్లతో ఐకానిక్ బ్రిడ్జి

image

TG: భాగ్యనగరానికి మరో ఐకానిక్ వంతెన రానుంది. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా మీర్ ఆలం ట్యాంక్ వద్ద ఈ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ₹304 కోట్లతో శాస్త్రిపురం నుంచి చింతల్‌మెట్‌ మీదుగా బెంగళూరు NHని కలుపుతూ దీన్ని నిర్మించనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు CM ప్రాధాన్యమివ్వడం తెలిసిందే. కాగా HYDలో దుర్గం చెరువుపై గతంలో కేబుల్ బ్రిడ్జి నిర్మించారు.

News November 10, 2025

ఏం జరిగినా పవన్ నోరు మెదపరు ఎందుకు: శ్యామల

image

AP: జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగినా CM రాజీనామా చేయాలన్న పవన్ ఇప్పుడు నోరు మెదపట్లేదని YCP నేత శ్యామల విమర్శించారు. ‘మీ ప్రభుత్వంలో ఎన్నో హత్యలు, నకిలీ మద్యంతో ప్రాణాలు పోతున్నా అది ప్రభుత్వ వైఫల్యం కాదు. తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ తొక్కిసలాటల్లో భక్తులు మరణిస్తే కిక్కురు మనకూడదు. విశాఖలో 2లక్షల KGల గో మాంసం దొరికినా నోరు మూసుకొని ఉండాలి. దీనిపై పవన్‌గారి స్పందన ఏంటో మరి’ అని ప్రశ్నించారు.

News November 10, 2025

ఆర్థిక మోసానికి గురయ్యారా? ఇలా ఫిర్యాదు చేయండి

image

ఆర్థిక మోసాలకు గురైన బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు Sachet పోర్టల్‌ను RBI ప్రారంభించింది. అక్రమంగా డిపాజిట్లు సేకరిస్తున్న సంస్థలు/వ్యక్తుల గురించి ఫిర్యాదు చేయడానికి దీనిని రూపొందించారు. మీరు మోసపోయినట్లయితే <>sachet.rbi.org.in<<>> పోర్టల్‌లో సంస్థ పేరు, అడ్రస్, మోసం వివరాలు వంటి పూర్తి సమాచారాన్ని అందించి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదును బట్టి పోలీసులకు లేదా దర్యాప్తు సంస్థలకు పంపుతారు.